Reading Time: < 1 minute

ముగిసిన వరంగల్ నిట్ కాన్వొకేషన్..పీజీ, పీహెచ్ డీ విద్యార్థులకు పట్టాలు ప్రదానం

Caption of Image.

హనుమకొండ, వెలుగు: వరంగల్  నిట్  24వ స్నాతకోత్సవం ముగిసింది. రెండో రోజు ఆదివారం పీజీ, పీహెచ్ డీ విద్యార్థులకు పట్టాలు ప్రదానం చేశారు. ఎన్ఐటీ బోర్డ్  ఆఫ్  గవర్నర్స్  చైర్ పర్సన్  డా.బీవీఆర్  మోహన్ రెడ్డి, నిట్  డైరెక్టర్  ప్రొఫెసర్​ బిద్యాధర్  సుబుధి 945 మందికి పీజీ, 100 మందికి పీహెచ్‌‌‌‌డీ పట్టాలు అందజేశారు. 

ఆడెపు అంజలి ఇంజినీరింగ్  విభాగాల్లో ఓవరాల్  పీజీ టాపర్ గా నిలవగా, జలుమేడి భరణి సైన్సెస్  అండ్  మేనేజ్‌‌‌‌మెంట్‌‌‌‌లో ఓవరాల్  పీజీ టాపర్ గా నిలిచి డైరెక్టర్  గోల్డ్  మెడల్  సాధించారు. కెమిస్ట్రీ డిపార్ట్​మెంట్ కు చెందిన డా.అపూర్వ భోరాకు ఉత్తమ పీహెచ్ డీ థీసిస్  అవార్డు అందజేశారు.

 ఉత్తమ ఎంటెక్  డిసర్టేషన్  అవార్డును అట్కారే సార్థక్  వినోద్  అందుకున్నారు. రెండు రోజుల పాటు జరిగిన 24వ కాన్వొకేషన్ లో 1,997 మంది పట్టాలు అందుకున్నారు.

©️ VIL Media Pvt Ltd.