
ఆర్టీసీ బస్సులో ప్రయాణించిన అలవాట్ల నుంచి మనోళ్లు ఇంకా బయటకు రానట్లున్నారు . ఫ్లైట్ ఆగక ముందే.. క్యూ కట్టిన విధానం.. ప్రవర్తన తీరుపై సోషల్ మీడియాలో కామెంట్స్ వైరల్ గా మారింది. ఫ్లైట్ రన్ వే మీద ఉండగానే ఇలా ప్రవర్తించడంపై విమర్శలు వస్తున్నాయి.
అమితవ్ దాస్ అనే ప్యాసెంజర్ ఎయిర్ ఇండియా ఎక్స్ ప్రెస్ IX 1236 అనే విమానంలో ఉన్న పరిస్థితిని వీడియో తీసి షేర్ చేశాడు. ప్యాసెంజర్లు నిలబడే ఉన్నారు.. కానీ ఫ్లైట్ మాత్రం మూవ్ అవుతనే ఉంది.. ఇది ఎయిర్ ఇండియాలో పరిస్థితి అంటూ ఎక్స్ లో పోస్ట్ చేశారు.
ప్యాసెంజర్స్ నిలబడే ఉన్నారు.. ఫ్లైట్ వెళ్తోంది.. ప్యాసెంజర్ల సేఫ్టీ గురించి ఏం చర్యలు తీసుకున్నారు.. అంటూ పోస్ట్ చేసిన ట్వీట్ వైరల్ గా మారింది.
వీడియో వైరల్ గా మారటంతో.. ఎయిర్ ఇండియా యాజమాన్యం వివరణ ఇచ్చింది. జరిగిన ఇబ్బందులపై ఎయిర్ ఇండియాలో ఆందోళన చెందుతున్నట్లు పేర్కొన్నారు. ఆన్ బోర్డ్ ఫ్లైట్ 1236లో జరిగిన అంతరాయానికి క్షమాపణ కోరుతున్నాం.. ప్యాసెంజర్స్ సేఫ్టీకే ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామని వివరణఇచ్చింది.
Some Indian Passenger Morons post landing – stand & que up even before Reaching the Gate, forget about Opening the Doors. @DGCAIndia
Should start levying Fines through Airlines for such Passengers !!!@AirIndiaX . https://t.co/AWLLvFSf3O— Vinayak (@vgmbhat) September 21, 2026