చాలా మంది పాల ప్యాకెట్ కవర్ రంగు చూసి, ఇవి కేవలం ప్యాకేజ్‌లో భాగం మాత్రమే అనుకుంటారు. కానీ పాలప్యాకెట్‌కు రంగులు ఇవ్వడం వెనుక కొన్ని కారణాలు ఉన్నాయంట. ముఖ్యంగా ఆ రంగులు వాటిలోని కొవ్వు శాతాన్ని తెలియజేస్తాయంట. కాగా, దాని గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం.
ఆరెంజ్ రంగు పాలప్యాకెట్ : ఇది ఫుల్ క్రీమ్ మిల్క్ ప్యాకెట్. ఈ రంగు ప్యాకెట్లోని పాలల్లో దాదాపు 6 శాతం కొవ్వు ఉంటుందంట. పాలు చాలా చిక్కగా, క్రీమీగా ఉంటాయి. వీటిని ఎక్కువగా స్వీట్, పెరుగు, నెయ్యి తయారీకి ఉపయోగిస్తుంటారు.
గ్రీన్ కలర్ పాల ప్యాకెట్ : ఇందులోని పాలు నార్మల్ ఫ్యాట్ ఉండే పాలు. చాలా బ్రాండ్స్ ఈ రంగును ఉపయోగిస్తాయి. ఈ పాలల్లో సుమారు 4.5 శాతం కొవ్వు ఉంటుందంట. అందువలన వీటిని ఎక్కువగా టీ, కాఫీల కోసం మాత్రమే ఉపయోగిస్తారు.
బ్లూ కలర్ పాల ప్యాకెట్ : నీలి రంగు పాల ప్యాకెట్స్ టోన్డ్ మిల్క్‌ను సూచిస్తుంటాయి. ఇందులో దాదాపు 3 శాతం కొవ్వు ఉంటుంది. ఫుల్ క్రీమ్ పాల కంటే కొంచెం తక్కువ. చాలా మంది వీటిని ఎక్కువా కేవలం పాలు తాగడానికి మాత్రమే కొనుగోలు చేస్తుంటారు.
గులాబీ రంగు పాల ప్యాకెట్ : ఈ రంగు పాల ప్యాకెట్ ఉండే పాలల్లో సుమారు 1.5 కొవ్వు శాతం ఉంటుంది. ఈ పాలు చాలా లేత రంగులో ఉంటాయి. లేతవి కూడా, వీటిని కొన్ని బ్రాండ్స్ డబుల్ డోన్డ్ మిల్క్ అని సూచించడానికి ఈ రంగును ఉపయోగిస్తున్నారు. తక్కువ కొవ్వు ఉండే పాలు కావాలి అనుకునే వారికి ఇది చాలా బెస్ట్ అని చెప్పాలి.




