Reading Time: < 1 minute

విలక్షణమైన కథలతో ప్రేక్షకులను మెప్పించే హీరోల్లో అడివి శేష్ ముందుంటాడు. అడివి శేష్ నుంచి సినిమా వస్తుందంటే.. అందులో ఏదో ఒక మిస్టరీ దాగి ఉంటుంది. అడివి శేష్ నటిస్తున్న లేటెస్ట్ చిత్రం ‘డెకాయిట్’. ఈ సినిమా గురించి ప్రకటన వచ్చి చాలా కాలమే అయినా.. అప్‌డేట్స్‌ మాత్రం చాలా తక్కువగా వచ్చాయి. షానిల్ డియో దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా నుంచి ఓ అదిరిపోయే అప్‌డేట్ వచ్చింది. డెకాయిట్ నుంచి తొలి సింగిల్ వచ్చేస్తోందని చిత్ర యూనిట్ అప్‌డేట్ ఇచ్చింది. ఈ సినిమా డెకాయిట్ కాక ముందు తన ప్రేమ కథ ఎలా సాగిందో తెలిపేలా.. ‘రుబారో’ అనే పాటను ఫిబ్రవరి 27న విడుదల చేస్తున్నట్లు వెల్లడించారు. ‘అతడు ఆమెను ప్రేమించాడు. ఆమె అతడిని మోసం చేసింది’ ‘మీకు అతడికి ఏం జరిగిందో తెలుస్తుంది.. మీరు అతడు ఏం ఫీల్ అయ్యాడో వింటారు’ అంటూ శేష్ ఈ అప్‌డేట్‌కి రాసుకొచ్చాడు. ఇక ఈ సినిమాలో మృణాల్ ఠాకూర్ హీరోయిన్‌గా నటిస్తున్న విషయం తెలిసిందే. ప్రకాశ్ రాజ్, అనురాగ్ కశ్యప్, సునీల్, అతుల్ కులకర్ణీ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమా ఉగాది కానుకగా మార్చి 19న థియేటర్లలోకి రానుంది.