
ఒక వైపు కల్తీ నెయ్యి, పరకామణి చోరీ, వస్త్రాల కొనుగోళ్లలో అవినీతి లాంటి అంశాలపై విచారణ జరుగుతుండగా.. ఇప్పుడు టీటీడీ విజిలెన్స్ విచారణ అత్యంత గొప్యంగా కొనసాగుతోంది. తిరుపతిలోని శ్రీగోవిందరాజస్వామి ఆలయ విమాన గోపురం పనుల్లో 50 కిలోల బంగారం మాయమైందనే ఆరోపణలపై విజిలెన్స్ విభాగం లోతుగా విచారణ జరుపుతోంది. 30కిపైగా విగ్రహాలు ధ్వంసమైన విషయం కూడా తెరపైకి వచ్చింది. ఎంతో ప్రాముఖ్యం ఉన్న శ్రీ గోవిందరాజస్వామి వారి ఆలయానికి 2022-23 మధ్యకాలంలో ఆలయ విమాన గోపురానికి బంగారు తాపడం పనులు చేసేందుకు టీటీడీ వంద కిలోల బంగారం కేటాయించింది. మరో 4300 కిలోల రాగితో విమాన గోపురం బంగారు తాపడం పనులను పూర్తి చేయాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా తొమ్మిది పొరలతో తాపడం చేయాలని జ్యోతి అనే మహిళ కాంట్రాక్ట్ దక్కించుకుంది. పనులు చేజిక్కించుకున్న కాంట్రాక్టర్ సబ్ లీజ్‌కు ఇచ్చింది. 9 పొరలతో బంగారు తాపడం పనులు చేపట్టాల్సి ఉండగా రెండు పొరలతోనే సరిపెట్టి దాదాపు సగం బంగారాన్ని మాయం చేసినట్లు ఆరోపణలున్నాయి. విమాన గోపురంపై 30కి పైగా విగ్రహాలు ధ్వంసం చేసి, ఆపై బంగారు తాపడం పనులు చేసినట్లు అప్పట్లోనే ఆరోపణలు వచ్చాయి.
మరిన్ని వీడియోల కోసం :