Reading Time: < 1 minute
భార్యను నడిరోడ్డుమీద కాల్చి చంపిన భర్త.. కారణం ఇదే వీడియో

అయినా భర్త వేధింపులు తట్టుకోలేక ఆరు నెలల క్రితం భువనేశ్వరి తన పిల్లలతో కలిసి వైట్‌ఫీల్డ్ ప్రాంతంలో ఇల్లు తీసుకుని రహస్యంగా ఉంటోంది. అయితే, భార్యపై కక్ష పెంచుకున్న బాలమురుగన్ ఆమె ఎక్కడ ఉందో ఆరా తీసి, నాలుగు నెలల క్రితమే ఆమె నివసించే ప్రాంతానికి సమీపంలోనే అద్దెకు దిగాడు. ఈ క్రమంలో వారం రోజుల క్రితం భార్య నుంచి విడాకుల నోటీసు అందడంతో బాలమురుగన్ ఆగ్రహం కట్టలు తెంచుకుంది. మంగళవారం సాయంత్రం 6:30 గంటల సమయంలో భువనేశ్వరి బ్యాంక్ పని ముగించుకుని ఇంటికి వస్తుండగా, ఆమె కోసం అప్పటికే మాటు వేసిన బాలమురుగన్ తన వద్దనున్న పిస్టల్‌తో అత్యంత సమీపం నుంచి కాల్పులు జరిపాడు. బుల్లెట్లు శరీరంలోకి దూసుకెళ్లడంతో రక్తపు మడుగులో పడిపోయిన ఆమెను ఆస్పత్రికి తరలించేలోపే ప్రాణాలు కోల్పోయినట్లు వైద్యులు ధ్రువీకరించారు.

మరిన్ని వీడియోల కోసం :

2025లో చక్ దే ఇండియా..వీడియో

వాళ్లకు ప్రమోషన్ పాఠాలు నేర్పిస్తున్న స్టార్ డైరెక్టర్ వీడియో

చిరంజీవి సినిమాలో మలయాళ సూపర్ స్టార్? వీడియో

మార్పు మంచిదే అంటున్న అనన్య పాండే వీడియో