
ఈ ఏడాది ప్రారంభంలో సంక్రాంతికి నారి నారి నడుమ మురారి సినిమాతో సాలిడ్ హిట్ అందుకున్నాడు శర్వానంద్. దీని తర్వాత
బైకర్ అంటూ ఓ స్పోర్ట్స్ డ్రామాతో మన ముందుకు వచ్చాడు శర్వా. అభిలాష్ రెడ్డి తెరకెక్కించిన ఈ సినిమాలో సీనియర్ హీరో రాజశేఖర్ హీరో తండ్రిగా ఓ కీలక పాత్రలో కనిపించారు. మాళవిక నాయర్ హీరోయిన్ గా యాక్ట్ చేసింది. భారతదేశపు మొట్టమొదటి మోటోక్రాస్ అడ్వంచరస్ చిత్రంగా యూవీ క్రియేషన్స్ బైకర్ సినిమాను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్మించింది. అందుకు తగ్గట్టుగానే ఏప్రిల్ 03న ప్రేక్షకుల ముందుకు వచ్చిన బైకర్ సినిమా ప్రేక్షకుల మెప్పు పొందింది. మరీ బ్లాక్ బస్టర్ టాక్ రాకపోయినా హిట్ టాక్ తో మంచి వసూళ్లనే రాబట్టింది. శర్వానంద్, రాజశేఖర్ ల నటన, తండ్రీ కొడుకుల ఎమోషనల్ సెంటిమెంట్, రేసింగ్ సన్నివేశాలు బైకర్ సినిమాలో హైలెట్ గా నిలిచాయి. సామాన్యులే కాదు అక్కినేని నాగార్జున, పీవీ సింధు లాంటి ప్రముఖులు కూడా బైకర్ సినిమాను చూసి ప్రశంసలు కురిపించారు. కాగా ఇప్పటికీ థియేటర్లలో ఓ మోస్తరు వసూళ్లను రాబడుతోన్న బైకర్ సినిమా డిజిట్ స్ట్రీమింగ్ కు సిద్ధమైందని సమాచారం.
బైకర్ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్ సొంతం చేసుకుంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఉన్న సమాచారం మేరకు ఈ సినిమా మే 1, 2026 నుండి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానున్నట్లు తెలుస్తోంది. అయితే ఇది ప్రస్తుతం కేవలం రూమర్ మాత్రమే. త్వరలోనే ఈ విషయంపై మేకర్స్ నుంచి అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది. బైకర్ సినిమాలో బ్రహ్మాజీ, అతుల్ కులకర్ణి తదితరులు వివిధ పాత్రల్లో మెరిశారు. జిబ్రాన్ ఈ మూవీకి స్వరాలు అందించారు. మరి థియేటర్స్ లో మంచి స్పందన తెచ్చుకున్న బైకర్ సినిమాకు ఓటీటీలో ఎలాంటి రిజల్ట్ వస్తుంది అనేది చూడాలి.
నెట్ ఫ్లిక్స్ చేతిలో బైకర్ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులు!
#Biker running successfully in its 3rd week
The racing sequences give you a high.
The emotions move you.Watch it in theatres today!
Book your tickets now for the SUMMER’S BUMPER FAMILY BLOCKBUSTER
https://t.co/p44bZA2nJP#BlockbusterBiker pic.twitter.com/sM74LJ8WRd
— UV Creations (@UV_Creations) April 18, 2026
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

