Reading Time: 2 minutes
Actor Imran Khan Among 400 Detained During Cjp Protest In Mumbai

Mumbai: కాక్‌రోచ్ జనతా పార్టీ (CJP) చేపట్టిన నిరసనలకు మద్దతుగా ముంబైలో ఆందోళనలు నిర్వహించడంతో టెన్షన్ వాతావరణం నెలకొంది. నిరసనకు పాల్పడుతున్న 400 మందికి పైగా నిరసనకారుల్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరిలో బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ ఖాన్ ఉన్నారు. దక్షిణ ముంబైలోని ఆగస్టు కాంత్రి మైదాన్‌తో పాటు నగరంలోని పలు ప్రాంతాల్లో అనుమతి లేకుండా ప్రజలు గుమిగూడటంతో పోలీసులు యాక్షన్ మొదలుపెట్టారు.

శనివారం క్రాంతి మైదాన్‌లో 200 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరిలో సామాజిక కార్యకర్త తుషార్ గాంధీ నేతృత్వంలోని ‘‘హమ్ భారత్ కే లోగ్’’ సభ్యులు, లెఫ్ట్ పార్టీ కార్యకర్తలు ఉన్నారు. ఢిల్లీలో సీజేపీ నిర్వహిస్తున్న నిరసనకు మద్దతుగా సంఘీభావం తెలిపేందుకు తామంతా వచ్చినట్లు చెప్పారు. అదుపులోకి తీసుకున్న వారిపై ఎఫ్ఐఆర్ ప్రక్రియ మొదలైనట్లు పోలీసులు తెలిపారు.

కాక్‌రోచ్ జనతా పార్టీ (CJP) చేపట్టిన నిరసనలకు మద్దతుగా ముంబైలో ఆందోళనలు నిర్వహించిన 400 మందికి పైగా నిరసనకారులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరిలో నటుడు ఇమ్రాన్ ఖాన్ కూడా ఉన్నారు. దక్షిణ ముంబైలోని ఆగస్టు క్రాంతి మైదాన్‌తో పాటు నగరంలోని ఇతర ప్రాంతాల్లో అనుమతి లేకుండా నిరసనలకు గుమిగూడిన వారిపై పోలీసులు చర్యలు చేపట్టారు.

శనివారం ఆగస్టు క్రాంతి మైదాన్‌లో కనీసం 200 మందిని అదుపులోకి తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. వీరిలో సామాజిక కార్యకర్త తుషార్ గాంధీ నేతృత్వంలోని ‘హమ్ భారత్ కే లోగ్’ సంస్థ సభ్యులు, భారత కమ్యూనిస్ట్ పార్టీ (మార్క్సిస్టు) మద్దతుదారులు ఉన్నారు. దేశ రాజధాని ఢిల్లీలో CJP నిర్వహిస్తున్న ఆందోళనకు సంఘీభావం తెలిపేందుకు వీరు అనుమతి లేకుండా సమావేశమైనట్లు అధికారులు పేర్కొన్నారు. అదుపులోకి తీసుకున్న వారిపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేసే ప్రక్రియ కొనసాగుతోందని ఓ అధికారి తెలిపారు.

మరోవైపు, ప్రకాశ్ అంబేడ్కర్ నేతృత్వంలోని వంచిత్ బహుజన్ ఆఘాడీ (VBA) కార్యకర్తలు దక్షిణ ముంబైలోని హుతాత్మా చౌక్ సమీపంలో CJPకి మద్దతుగా నిరసన చేపట్టారు. వీరిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిరసనకారులు ప్రధాని నరేంద్రమోడీ, ప్రధాన ఎన్నికల కమిషనర్ (CEC) జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.