Reading Time: < 1 minute
Mamata Banerjee Kejriwal Pinarayi Vijayan Detained During Delhi Protest

Jantar Mantar Protest: ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద కాక్‌రోచ్ జనతా పార్టీ (CJP) చేపట్టిన నిరసనకు మద్దతు తెలిపేందుకు వెళ్తున్న పలువురు ప్రతిపక్ష నేతల్ని పోలీసులు శనివారం అదుపులోకి తీసుకున్నారు. పశ్చిమ బెంగాల్ మాజీ సీఎం, టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ, ఢిల్లీ మాజీ సీఎం, ఆప్ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్, కేరళ మాజీ సీఎం పినరయి విజయన్‌లతో పాటు పలువురు విద్యార్థి నేతల్ని పోలీసులు అదపులోకి తీసుకుని అక్కడి నుంచి తరలించారు.

మమతా బెనర్జీ తన పార్టీకి చెందిన ఎంపీలతో కలిసి సెంట్రల్ ఢిల్లీలోని సౌత్ అవెన్యూ ప్రాంతానికి చేరుకున్నారు. పోలీసులు ఆమెను ముందుకు వెళ్లకుండా అడ్డుకోవడంతో అమె అక్కడే బస్టాప్‌లో కూర్చుని నిరసన తెలిపారు. టీఎంసీ ఎంపీలు డెరెక్ ఓబ్రియిన్, దోల్ సేన్ సహా ఐదుగురిని పోలీసులు అదుపులోకి తీసుకుని బస్సులో తరలించారు. ప్రభుత్వం తమతో అనుచితంగా వ్యవహరిస్తోందని, ప్రజల గొంంతుకను నొక్కేస్తోందని, ఇండియా కూటమి పోరాటాన్ని కొనసాగస్తుందని మమతా అన్నారు.

మరోవైపు, నిరసనల్లో పాల్గొనేందుకు వెళ్తున్న అరవింద్ కేజ్రీవాల్‌ను ఇంటి బయట నుంచే అదుపులోకి తీసుకున్నారు. పినరయి విజయన్, సీపీఎం ఎంపీ జాన్ బ్రిట్టాస్‌లను కూడా పోలీసులు అదుపులోకి తీసుకుని ఛత్రసాల్ స్టేడియంలోని డిటెన్షన్ సెంటర్‌కు తరలించారు.