
ఢిల్లీలో జంతర్ మంతర్ దగ్గర నిరసనల్లో పాల్గొనేందుకు వస్తున్న కాక్రోచ్ జనతా పార్టీ చీఫ్ అభిజీత్ దీప్కే, సౌరవ్ దాస్, అశోతోష్ రాంకాలు ఎయిర్ పోర్టులోనే అడ్డుకుని అరెస్ట్ చేశారు పోలీసులు. సీజేపీ నేతలు ఎయిర్ ఇండియా విమానంలో ఎయిర్ పోర్టులో ల్యాండ్ కాగానే నాటకీక పరిణామాల మధ్య వారిని అరెస్ట్ చేశారు. విమానంలో ప్రవేశించి ఆ ముగ్గురిని అరెస్ట్ చేశారు. అయితేద దీప్కే అతని బృందాన్ని అదుపులోకి తీసుకునేందుకు మహిళా పోలీసులను పంపడం వంటి ఊహించని పరిణామంతో కాక్రోచ్ పార్టీ నేతల అరెస్టు ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
కాక్రోచ్ పార్టీ నేతలను అరెస్ట్ చేయడంలో మహిళా పోలీసులను పంపడం వెనక ఏదో వ్యూహాత్మక ఉద్దేశం దాగి ఉందని విశ్లేషకులు చెబుతున్నారు. పురుష పోలీస్ అధికారులను పంపిస్త ఘర్షణలకు దారి తీయొచ్చని ఊహించి మహిళా పోలీసులను రంగంలోకి దింపి ఉంటారని అంచనా వేస్తున్నారు. అంతేకాదు. విమానం ఇరుకుగా ఉండే ప్రదేశం కాబట్టి కాక్రోచ్ పార్టీ నేతలను అక్కడే అరెస్ట్ చేస్తే పెద్దగా ఘర్షణలు ఉండకపోవచ్చని పోలీసులు పక్కా వ్యూహాన్ని అమలు చేశారు . అరెస్టుల సందర్భంగా చిన్నా వాగ్వాదాలతో ఎలాంటి పెద్ద గందరగోళం లేకుండా దీప్కే , ఇతర సీజేపీ నాయకులను అదుపులోకి తీసుకున్నారు.
విమానంలోనే అరెస్టులు..
సీజేపీ నేతలను అదుపులోకి తీసుకునేందుకు మహిళా పోలీసులను పంపడం ఆసక్తికరంగా మారింది. పోలీసులు విమానంలోకి రాగానే నేతలు ‘ఇంక్విలాబ్ జిందాబాద్’, ‘భారత్ మాతా కీ జై’ అంటూ నినాదాలు చేశారు. విమానం దిగేవరకు వేచి ఉండకుండా లోపలే అరెస్ట్ చేయడంపై అభిజీత్ దీప్కే అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ చర్యను నియంతృత్వంగా అభివర్ణించారు. అనంతరం ముగ్గురిని వేర్వేరు ప్రాంతాలకు తరలించారు.
ఢిల్లీ అంతటా భారీ భద్రత..
ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలని, ఓటర్ల జాబితాల ప్రత్యేక సవరణ (SIR) ప్రక్రియను వ్యతిరేకిస్తూ సీజేపీ ఈ నిరసనకు పిలుపునిచ్చింది. ఎన్నికల కమిషనర్ల నియామక చట్టాన్ని సవరించాలని కూడా డిమాండ్ చేసింది. అంతకుముంద నిరసనల్లో పాల్గొనకుండా అడ్డుకునేందుకు యూట్యూబర్ ధ్రువ్ రాథీ, సీజేపీ లీగల్ సెల్ హెడ్ రత్న సింగ్‌లను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. ఢిల్లీలో 400 మందికి పైగా నిర్బంధించినట్లు మీడియా రిపోర్టు చెబుతోంది. పలు మెట్రో స్టేషన్లను మూసివేసి నిరసనలకు ముందే పోలీసులు చర్యలు చేపట్టడంతో నగరంలో ఉద్రిక్తత నెలకొంది.
After Dhruv Rathi, Delhi Police now boards Air India flight at IGI and detains CJP’s Abhijeet Dipke, Saurav Das & Ashutosh Ranka ahead of Oct 10 Jantar Mantar protest. Dipke: “I have come to be arrested.” Police: “Not an arrest, please cooperate.”https://t.co/TSO2HA4Ce5 https://t.co/ABkM3H9nHq
— HINT News (@9415st) October 10, 2026