Reading Time: < 1 minute
Rajinikanth Dharman Ram Pothineni To Play Antagonist Role

Ram Pothineni in Rajinikanth’s Dharman Movie: ‘సూపర్‌ స్టార్‌’ రజినీకాంత్‌ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న క్రేజీ ప్రాజెక్ట్‌ ‘ధర్మన్‌’పై అభిమానుల్లో రోజురోజుకూ ఆసక్తి పెరుగుతోంది. ‘గుడ్‌ బ్యాడ్‌ అగ్లీ’ ఫేమ్‌ అశ్వత్‌ మారిముత్తు ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ప్రస్తుతం ధర్మన్‌ షూటింగ్‌ శరవేగంగా జరుగుతోంది. ఈ సినిమాలో సీనియర్‌ నటి సిమ్రాన్‌ కీలక పాత్రలో నటిస్తుండగా.. తాజాగా టాలీవుడ్‌ స్టార్ హీరో రామ్‌ పోతినేని కూడా భాగం అయ్యారు. రాశి ఖన్నా తాజాగా సోషల్‌ మీడియాలో షేర్‌ చేసిన ఫొటోతో ధర్మన్‌లో రామ్‌ నటిస్తున్నారని ఖాయం అయింది. ఇప్పటివరకు ప్రచారానికే పరిమితమైన రూమర్స్ ఇప్పుడు నిజమని తేలిపోయింది.

ధర్మన్‌లో రామ్‌ పోతినేని విలన్‌ రోల్‌ చేస్తున్నారని సమాచారం. రామ్‌ పోషించబోయే పాత్ర విలన్‌ ఛాయలతో ఉన్నప్పటికీ.. పూర్తిస్థాయిలో ప్రతినాయకుడిగా ఉండదని టాక్. ఈ సినిమాలో రాశి ఖన్నా సూపర్‌స్టార్‌ రజినీకాంత్‌ కుమార్తెగా కనిపించనున్నట్లు తెలుస్తోంది. ఆమె ప్రేమికుడిగా రామ్ నటిస్తున్నట్లు టాక్. దీంతో రజినీకాంత్‌, రామ్‌, రాశి కాంబినేషన్‌పై ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది. రామ్‌ ఇంతకుముందు హీరోగా చేసిన సినిమాలతో పోలిస్తే.. ధర్మన్‌లో ఆయన పాత్ర భిన్నంగా ఉండనుండటంతో అభిమానుల్లోనూ క్యూరియాసిటీ పెరిగింది.

అశ్వత్‌ మారిముత్తు దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో రజినీకాంత్‌ ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. సిమ్రాన్‌ కూడా కీలక పాత్రలో కనిపించనున్నారు. ప్రేమ, కుటుంబ అంశాలతో పాటు రజినీకాంత్‌ ఇమేజ్‌కు తగ్గట్టుగా వినోదం, యాక్షన్‌ అంశాలను మేళవిస్తూ సినిమాను రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది. ధర్మన్‌ను సంక్రాంతి 2027 కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని మేకర్స్‌ ప్లాన్‌ చేస్తున్నారు. ప్రస్తుతం ధర్మన్ మూవీ మైసూర్ లొకేషన్లలో శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నాడు.