Reading Time: 2 minutes

WPL 2027 రిటెన్షన్ లిస్ట్ రిలీజ్.. ఏ జట్టు ఎవరిని రిటైన్ చేసిందంటే?

Caption of Image.
* WPL 2027 సీజన్‌కు సంబంధించి జోరందుకున్న సన్నాహాలు
* WPL 2027 కోసం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఏ ఆటగాళ్లను రిటైన్ చేసుకుంది
* కొత్త సీజన్ కోసం ముంబై ఇండియన్స్ ఏ కీలక ఆటగాళ్లను విడుదల చేసిందంటే
* WPL 2027 కోసం UP వారియర్జ్ దీప్తి శర్మను ఎందుకు ఉంచుకున్నారు

 

WPL 2027: మహిళల ప్రీమియర్ లీగ్ (WPL) 2027 సీజన్‌కు సంబంధించి సన్నాహాలు జోరందుకున్నాయి. ఈ మెగా టోర్నీకి ముందస్తుగా అక్టోబర్ 28వ తేదీన వేలం జరగనుంది. ఈ నేపథ్యంలో లీగ్‌లోని ఐదు ఫ్రాంచైజీలు తాము రిటైన్ (ఉంచుకున్న) చేసుకున్న, రిలీజ్ (వదిలేసిన) చేసిన ఆటగాళ్ల జాబితాను అధికారికంగా విడుదల చేశాయి. 2027 ప్రారంభంలో జరగబోయే ఈ టోర్నమెంట్లో ప్రపంచస్థాయి మహిళా క్రికెటర్లు పోటీ పడనున్నారు. 

* ఆర్సీబీ నిర్ణయాలు – ఎల్లిస్ పెర్రీ రీ-ఎంట్రీ: 

స్మృతి మంధాన నాయకత్వంలో 2024, 2026 ఎడిషన్లలో విజేతగా నిలిచిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB), తమ మూడో టైటిల్ లక్ష్యంగా వ్యూహాత్మక మార్పులు చేసింది. ఆస్ట్రేలియా హార్డ్ హిట్టింగ్ బ్యాటర్ గ్రేస్ హారిస్‌ను రిలీజ్ చేయడం ఆర్సీబీ తీసుకున్న ప్రధాన నిర్ణయాల్లో ఒకటి. హారిస్‌తో పాటు లిన్సీ స్మిత్, డి. హేమలత, గౌతమి నాయక్‌లను కూడా జట్టు నుంచి విడుదల చేసింది. కాగా, వ్యక్తిగత కారణాలతో 2026 సీజన్‌కు దూరమైన స్టార్ ఆల్‌రౌండర్ ఎల్లిస్ పెర్రీ తిరిగి జట్టులోకి రావడం ఆర్సీబీకి పెద్ద బలంగా మారింది.

* ముంబై ఇండియన్స్, యూపీ వారియర్జ్ వ్యూహాలు: 

* రెండు సార్లు ఛాంపియన్‌గా నిలిచిన ముంబై ఇండియన్స్ జట్టు తమ కోర్ టీమ్‌ను నిలబెట్టుకుంది. కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్, అమన్‌జోత్ కౌర్, నికోలా కేరీ, మెలీ కేర్, హేలీ మాథ్యూస్, నాట్ సివర్-బ్రంట్ లాంటి కీలక ఆటగాళ్లను రిటైన్ చేసుకోగా.. మిల్లీ ఇల్లింగ్‌వర్త్, సైకా ఇషాక్ తదితరులను వదిలి పెట్టింది. 

* అటు యూపీ వారియర్జ్ తమ స్టార్ ఆల్‌రౌండర్ దీప్తి శర్మతో పాటు మెగ్ లానింగ్, హర్లీన్ డియోల్, క్రాంతి గౌడ్‌లను రిటైన్ చేసుకోగా, అమీ జోన్స్, కిరణ్ నవ్‌గిరే, క్లోయే టైరాన్, డియాండ్రా డాటిన్ లాంటి అనుభవజ్ఞులైన ఆటగాళ్లను జట్టు నుంచి వదిలి పెట్టింది. 

ఐదు ఫ్రాంచైజీల రిటైన్, రిలీజ్ చేసిన ఆటగాళ్ల వివరాలు:

* ఢిల్లీ క్యాపిటల్స్ (Delhi Capitals): 

రిలీజ్ చేసిన ఆటగాళ్లు: అలనా కింగ్, లిజెల్ లీ, స్నేహ్ రాణా, తానియా భాటియా, ప్రగతి సింగ్, ఎడ్ల సృజన.

రిటైన్ చేసిన ఆటగాళ్లు: అన్నాబెల్ సదర్లాండ్, చినెల్లె హెన్రీ, లారా వోల్వార్ట్, లూసీ హామిల్టన్, మారిజానే కాప్, దియా యాదవ్, జెమిమా రోడ్రిగ్స్, మమతా మడివాల, మిన్ను మణి, ఎన్. శ్రీ చరణి, నందిని శర్మ, నికి ప్రసాద్, షఫాలీ వర్మ.

ALSO READ : విరాట్‌ కొంచెం కూడా మారలేదు

* గుజరాత్ జెయింట్స్ (Gujarat Giants): 

రిలీజ్ చేసిన ఆటగాళ్లు: డానీ వ్యాట్-హాడ్జ్, ఆయుషి సోని, తిటాస్ సాధు, శివాని సింగ్.

రిటైన్ చేసిన ఆటగాళ్లు: ఆష్లీ గార్డ్‌నర్, బెత్ మూనీ, జార్జియా వేర్‌హామ్, కిమ్ గార్త్, సోఫీ డివైన్, అనుష్క శర్మ, భారతి ఫుల్మాలి, హ్యాపీ కుమారి, జింటిమణి కలిత, కనికా అహుజా, కాశ్వి గౌతమ్, రాజేశ్వరి గైక్వాడ్, రేణుకా సింగ్, తనుజా కన్వర్, యస్తికా భాటియా.

* ముంబై ఇండియన్స్ (Mumbai Indians): 

రిలీజ్ చేసిన ఆటగాళ్లు: మిల్లీ ఇల్లింగ్‌వర్త్, జి. కమలిని, క్రాంతి రెడ్డి, పూనమ్ ఖేమ్నార్, సైకా ఇషాక్, త్రివేణి వసిష్ఠ.

రిటైన్ చేసిన ఆటగాళ్లు: మెలీ కేర్, హేలీ మాథ్యూస్, నాట్ సివర్-బ్రంట్, నికోలా కేరీ, అమన్‌జోత్ కౌర్, హర్మన్‌ప్రీత్ కౌర్, రాహిలా ఫిర్దౌస్, ఎస్. సజ్జన, సంస్కృతి గుప్తా, షబ్నిమ్ ఇస్మాయిల్, వైష్ణవి శర్మ.

* రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (Royal Challengers Bengaluru):

రిలీజ్ చేసిన ఆటగాళ్లు: గ్రేస్ హారిస్, లిన్సీ స్మిత్, డి. హేమలత, గౌతమి నాయక్.

రిటైన్ చేసిన ఆటగాళ్లు: ఎల్లిస్ పెర్రీ, జార్జియా వోల్, లారెన్ బెల్, నాడిన్ డి క్లెర్క్, అరుంధతి రెడ్డి, పూజా వస్త్రాకర్, ప్రత్యూష కుమార్, ప్రేమా రావత్, రాధా యాదవ్, రిచా ఘోష్, సయాలీ సత్ఘారే, శ్రేయాంక పాటిల్, స్మృతి మంధాన.

* యూపీ వారియర్జ్ (UP Warriorz): 

రిలీజ్ చేసిన ఆటగాళ్లు: అమీ జోన్స్, చార్లీ నాట్, క్లోయే టైరాన్, డియాండ్రా డాటిన్, ఆశా శోభన, జి. త్రిష, కిరణ్ నవ్‌గిరే, శ్వేతా సెహ్రావత్, సుమన్ మీనా.

రిటైన్ చేసిన ఆటగాళ్లు: మెగ్ లానింగ్, ఫోబ్ లిచ్‌ఫీల్డ్, సోఫీ ఎక్లెస్టోన్, తారా నోరిస్, దీప్తి శర్మ, హర్లీన్ డియోల్, క్రాంతి గౌడ్, ప్రతికా రావల్, శిఖా పాండే, షిప్రా గిరి, సిమ్రాన్ షేక్.

©️ VIL Media Pvt Ltd.