Reading Time: < 1 minute
Golden Bhagyam Sathya And Yogi Babus Comedy Film Title Glimpse

Golden Bhagyam Movie Glimpse Goes Viral: టాలీవుడ్ కమెడియన్ సత్య, కోలీవుడ్ కమెడియన్ యోగిబాబు ప్రధాన పాత్రల్లో కొత్త సినిమా తెరకెక్కుతోంది. ‘రంగబలి’ ఫేమ్ పవన్ బాసంశెట్టి ఈ చిత్రానికి దర్శకత్వం వహించడమే కాకుండా.. నిర్మాతగానూ వ్యవహరిస్తున్నారు. డ్రీమ్ మూవీ మేకర్స్, నయవాయు చిత్రాల బ్యానర్లపై నాగార్జున రెడ్డి, శ్రీకాంత్ రెడ్డి, బాపి రెడ్డి, పవన్ బాసంశెట్టి సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన టైటిల్ గ్లింప్స్‌ను మేకర్స్ విడుదల చేశారు.

టాలీవుడ్, కోలీవుడ్ కమెడియన్ల చిత్రానికి ‘గోల్డెన్ భాగ్యం’ అనే ఆసక్తికరమైన టైటిల్‌ను ఖరారు చేశారు. విడుదలైన గ్లింప్స్ ఆద్యంతం కామెడీతో ఆకట్టుకుంటూ సినిమాపై అంచనాలను పెంచుతోంది. సత్య, యోగిబాబు మధ్య వచ్చే సన్నివేశాలు, డైలాగ్స్ ప్రేక్షకులను నవ్విస్తున్నాయి. ఈ సినిమాను కేవలం తెలుగు లేదా తమిళ చిత్రంగా కాకుండా.. రెండు భాషలకు చెందిన నటీనటులు, సంస్కృతులను మేళవిస్తూ రూపొందిస్తున్నట్లు మేకర్స్ తెలిపారు. ‘ఇది తెలుగు, తమిళ సినిమా కాదు.. ‘తెలుమిళ్ సినిమా’ అంటూ యోగిబాబు చెప్పే డైలాగ్ గ్లింప్స్‌లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ కాన్సెప్ట్ సినిమాపై మరింత ఆసక్తిని కలిగిస్తోంది.

పూర్తిస్థాయి కామెడీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో కామెడీతో పాటు లవ్, క్రైమ్, యాక్షన్ అంశాలు కూడా ఉండనున్నట్లు దర్శకుడు పవన్ బాసంశెట్టి హింట్ ఇచ్చారు. ఈ సినిమాలో జయశ్రీ, అధిరాజ్ కథానాయికలుగా నటిస్తున్నారు. వెన్నెల కిశోర్, సుదర్శన్, కిశోర్ తిరుమల, రోహిణి, తనికెళ్ల భరణి, సునీల్ రెడ్డి తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. తెలుగు, తమిళ హాస్య నటుల కాంబినేషన్‌లో రూపొందుతున్న ‘గోల్డెన్ భాగ్యం’ ప్రేక్షకులకు ఎలాంటి వినోదాన్ని అందిస్తుందో చూడాలి.