July 23, 2026

Richest Star Kids: హృతిక్ నుంచి అల్లు అర్జున్ వరకు.. 2026లో అత్యంత ధనవంతులైన స్టార్ కిడ్స్ ఎవరో తెలుసా?

Richest Star Kids: హృతిక్ నుంచి అల్లు అర్జున్ వరకు.. 2026లో అత్యంత ధనవంతులైన స్టార్ కిడ్స్ ఎవరో తెలుసా?
Reading Time: 2 minutes
Richest Star Kids In India 2026 Hrithik Roshan Tops Ram Charan Allu Arjun And Jr Ntr In List

Richest Star Kids: కొన్ని కుటుంబాల్లో పుట్టడం అదృష్టమే కావచ్చు. అయితే ఆ అదృష్టాన్ని వేల కోట్ల వ్యాపార సామ్రాజ్యంగా మార్చడం మాత్రం అందరికీ సాధ్యం కాదు. ఒకప్పుడు ‘స్టార్ కిడ్’ అంటే వారసత్వంగా అవకాశాలు పొందిన హీరోలుగా మాత్రమే భావించేవారు. అయితే ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. నేటి స్టార్ కిడ్స్ సినిమాల ద్వారానే కాకుండా, వ్యాపారాలు, స్టార్టప్ పెట్టుబడులు, ప్రొడక్షన్ హౌస్‌లు, ఫ్యాషన్ బ్రాండ్లు, రియల్ ఎస్టేట్, స్పోర్ట్స్ వెంచర్లు, బ్రాండ్ ఎండార్స్‌మెంట్ల ద్వారా కూడా వేల కోట్ల సంపదను కూడబెట్టుకుంటున్నారు. దీంతో భారతీయ సినీ పరిశ్రమలో అత్యంత సంపన్నుల జాబితాలో స్టార్ కిడ్స్ ఆధిపత్యం స్పష్టంగా కనిపిస్తోంది.

2026 జూలై నాటికి అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం, భారతదేశంలో అత్యంత ధనవంతులైన స్టార్ కిడ్‌గా హృతిక్ రోషన్ నిలిచినట్లు తెలుస్తోంది. ఆయన అంచనా నికర ఆస్తి విలువ సుమారు రూ.3,100 కోట్లుగా చెబుతున్నారు. నటుడిగానే కాకుండా, ఆయన స్థాపించిన ఫిట్‌నెస్ బ్రాండ్ HRX, భారీ బ్రాండ్ ఎండార్స్‌మెంట్లు, రియల్ ఎస్టేట్ పెట్టుబడులు హృతిక్ సంపదను అమాంతం పెంచాయి. ఈ జాబితాలో రెండో స్థానంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఉండటం విశేషం. ఆయన ఆస్తి విలువ రూ.1,300 నుంచి రూ.1,600 కోట్ల మధ్య ఉంటుందని అంచనా. RRR తర్వాత ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన రామ్ చరణ్, కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ, రియల్ ఎస్టేట్, స్పోర్ట్స్ వెంచర్లు, బ్రాండ్ డీల్స్ ద్వారా భారీగా సంపాదిస్తున్నారు.

మూడో స్థానంలో సైఫ్ అలీ ఖాన్ ఉన్నారు. పటౌడీ రాజకుటుంబ వారసత్వంతో పాటు, సినిమాలు, ప్రకటనలు, ఆస్తులు, పెట్టుబడులతో ఆయన నికర ఆస్తి రూ.1,200 నుంచి రూ.1,300 కోట్ల మధ్యగా అంచనా వేస్తున్నారు. నాలుగో స్థానంలో అలియా భట్ రూ.550 కోట్లతో నిలిచారు. నటిగా హిట్లు కొడుతూనే బ్రాండ్, స్టార్టప్ పెట్టుబడులతో ఆమె ఆదాయాన్ని బాగానే అర్జిస్తోంది.  పెంచాయి. ఐదో స్థానంలో కరీనా కపూర్ ఖాన్ సుమారు రూ.500 కోట్ల ఆస్తితో కొనసాగుతున్నారు. సినిమాలు, ఓటీటీ ప్రాజెక్టులు, బ్రాండ్ అంబాసిడర్, పెట్టుబడులు ఆమె సంపదను కూడా మరింత పెంచాయి.

ఇక తెలుగు ఇండస్ట్రీ నుంచి అల్లు అర్జున్ ఈ జాబితాలో ఆరో స్థానంలో నిలిచారు. ఆయన నికర ఆస్తి రూ.460 నుంచి రూ.500 కోట్ల మధ్యగా అంచనా. పుష్ప విజయంతో దేశవ్యాప్తంగా అత్యధిక పారితోషికం తీసుకునే నటుల్లో ఒకరిగా మారిన అల్లు అర్జున్, AAA సినిమాస్, అల్లు స్టూడియోస్, ఆహా, హైలైఫ్ బ్రూయింగ్ కంపెనీ, బఫెలో వైల్డ్ వింగ్స్ ఫ్రాంచైజీలు, రియల్ ఎస్టేట్, భారీ బ్రాండ్ ఒప్పందాలతో వ్యాపారవేత్తగానూ ప్రత్యేక గుర్తింపు సంపాదించారు. జూనియర్ ఎన్టీఆర్ కూడా సుమారు రూ.500 కోట్ల ఆస్తితో ఈ జాబితాలో చోటు దక్కించుకున్నారు. RRR తర్వాత ఆయన మార్కెట్ విలువ భారీగా పెరగడంతో పాటు బ్రాండ్ ఎండార్స్‌మెంట్లు, వ్యాపారాల ద్వారా కూడా ఆదాయం పొందుతున్నారు. ఒకప్పుడు స్టార్ కిడ్స్‌కు సినీ నేపథ్యమే బలం అని భావించేవారు. అయితే ఇప్పుడు వారు బిజినెస్, పెట్టుబడులు, కొత్త రంగాల్లో అడుగుపెట్టడం ద్వారా తమ సంపదను అమాంతం విస్తరించుకుంటున్నారు. దీంతో సినీ వారసత్వాన్ని మాత్రమే కాదు, వ్యాపార సామ్రాజ్యాలను కూడా నిర్మిస్తున్న కొత్త తరం స్టార్ కిడ్స్‌గా వీళ్ళు నిలుస్తున్నారు.