July 23, 2026

Team India : ఇంగ్లాండ్ టూర్ దెబ్బకు.. ఆ నలుగురు భారత ఆటగాళ్ల కెరీర్ డేంజర్ జోన్‌లోకి!

Team India : ఇంగ్లాండ్ టూర్ దెబ్బకు.. ఆ నలుగురు భారత ఆటగాళ్ల కెరీర్ డేంజర్ జోన్‌లోకి!
Reading Time: 2 minutes
Team India : ఇంగ్లాండ్ టూర్ దెబ్బకు.. ఆ నలుగురు భారత ఆటగాళ్ల కెరీర్ డేంజర్ జోన్‌లోకి!

Team India : ఇంగ్లాండ్ గడ్డపై ఇటీవల ముగిసిన పరిమిత ఓవర్ల సిరీస్‌లో టీమిండియా ఆశించిన స్థాయిలో రాణించలేకపోయింది. ముఖ్యంగా వన్డే సిరీస్‌లో బలమైన జట్టుతో బరిలోకి దిగినప్పటికీ, ఇంగ్లాండ్ చేతిలో 1-2 తేడాతో సిరీస్‌ను కోల్పోవాల్సి వచ్చింది. ఈ పరాభవం భారత జట్టు మేనేజ్‌మెంట్‌ను తీవ్రంగా ఆలోచించేలా చేసింది. దారుణ ప్రదర్శన కనబరిచిన పలువురు ఆటగాళ్ల భవిష్యత్తు ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. రాబోయే సిరీస్‌లలో జట్టు ప్రక్షాళన జరిగే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఇంగ్లాండ్ టూర్‌లో ఫ్లాప్ అయ్యి ఇకపై వన్డే జట్టులో ఆ నలుగురికి చోటు దక్కడం కష్టంగా మారే సూచనలు కనిపిస్తున్నాయి.

వాషింగ్టన్ సుందర్

ఈ జాబితాలో ఆల్ రౌండర్ వాషింగ్టన్ సుందర్ పేరు ముందుగా వినిపిస్తోంది. స్పిన్ బౌలింగ్ ఆల్ రౌండర్‌గా బరిలోకి దిగిన సుందర్, ఇంగ్లాండ్‌తో జరిగిన రెండు వన్డేల్లోనూ పూర్తిగా నిరాశపరిచాడు. బ్యాటింగ్‌లో తొలి మ్యాచ్‌లో పర్వాలేనిపించినా, రెండో మ్యాచ్‌లో కేవలం 2 పరుగులకే వెనుదిరిగడాడు. ఇక బౌలింగ్‌లో అయితే ఒక్క వికెట్ కూడా తీయలేకపోయాడు. కీలక సమయాల్లో జట్టుకు ఉపయోగపడకపోవడంతో భవిష్యత్తులో అతనికి వన్డే జట్టులో చోటు దక్కడం అనుమానంగా మారింది.

శివమ్ దూబే

ప్రధానంగా టీ20 ఫార్మాట్‌కు సరిపోయే పేస్ ఆల్ రౌండర్ శివమ్ దూబేకు ఇంగ్లాండ్ వన్డే సిరీస్‌లో అవకాశం దక్కింది. అయితే వచ్చిన అవకాశాలను అతను పూర్తిగా సద్వినియోగం చేసుకోలేకపోయాడు. ఆడిన రెండు మ్యాచ్‌లలో కలిపి ఒక ఇన్నింగ్స్‌లో గోల్డెన్ డక్ అయ్యాడు. బౌలింగ్‌లో రెండు మ్యాచ్‌లు ఆడి కేవలం 2 వికెట్లు మాత్రమే తీయగలిగాడు. ఏ విభాగంలోనూ ప్రభావం చూపలేకపోవడంతో సెలక్టర్ల నమ్మకాన్ని దూబే కోల్పోయే ప్రమాదం ఉంది.

ఇషాన్ కిషన్

యువ వికెట్ కీపర్ బ్యాటర్ ఇషాన్ కిషన్ నుంచి భారీ ఆశలు పెట్టుకున్నారు. కానీ ఇంగ్లాండ్ సిరీస్‌లో అతను ఘోరంగా విఫలమయ్యాడు. ఆడిన రెండు వన్డేల్లో వరుసగా 1, 14 పరుగులు మాత్రమే చేసి పెవిలియన్ చేరాడు. ఇషాన్ విఫలం కావడం వల్ల భారత మిడిల్ ఆర్డర్ తీవ్రంగా బలహీనపడింది. మూడు ఫార్మాట్లలోనూ ఆడగల సత్తా ఉన్నప్పటికీ, ఇలాంటి కీలక టూర్‌లలో విఫలమవడం అతని కెరీర్‌కు పెద్ద మచ్చగా మారింది.

ప్రిన్స్ యాదవ్

యువ పేసర్ ప్రిన్స్ యాదవ్ పట్ల టీమిండియా మేనేజ్‌మెంట్ భారీ అంచనాలు పెట్టుకుంది. ఐర్లాండ్, ఇంగ్లాండ్ టూర్‌లలో టీ20ల్లో బాగా రాణించినా, లార్డ్స్ వేదికగా జరిగిన నిర్ణయాత్మక వన్డేలో మాత్రం అతను తేలిపోయాడు. తన కోటా 10 ఓవర్లలో ఏకంగా 7.90 ఎకానమీతో 79 పరుగులు సమర్పించుకుని కేవలం 1 వికెట్ మాత్రమే దక్కించుకున్నాడు. విదేశీ పిచ్‌లపై అనుభవలేమి కొట్టొచ్చినట్లు కనిపించడంతో, రాబోయే రోజుల్లో అతనికి వన్డేల్లో ఛాన్సులు రావడం కష్టమే.

 

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి