చెన్నై గ్రాండ్ మాస్టర్స్ టోర్నీలో రెండో ప్లేస్‌లో అర్జున్

చెన్నై: తెలంగాణ గ్రాండ్ మాస్టర్ అర్జున్ ఎరిగైసి.. చెన్నై గ్రాండ్ మాస్టర్స్ టోర్నీలో సంయుక్తంగా రెండో ప్లేస్‌లో నిలిచాడు. బుధవారం జరిగిన ఆఖరిదైన ఏడో రౌండ్‌లో అర్జున్.. అలీరెజా ఫిరౌజాతో జరిగిన గేమ్‌ను 41 ఎత్తుల వద్ద డ్రా చేసుకున్నాడు. దాంతో దిమిత్రి ఆండ్రైకిన్‌తో కలిసి నాలుగు పాయింట్లతో నిలిచాడు.
అలీరెజా రెండు విజయాలు, ఐదు డ్రాలతో కలిపి నాలుగున్నర పాయింట్లతో టైటిల్‌ను సొంతం చేసుకున్నాడు. ఆడిన ఏడు మ్యాచ్‌ల్లో మూడింటిలో ఓడిన వరల్డ్ చాంపియన్ డి. గుకేశ్ రెండు పాయింట్లతో ఆఖరి ప్లేస్‌లో నిలిచాడు. నీహల్ సరీన్, ఎం. ప్రణేశ్ చెరో మూడున్నర పాయింట్లు సాధించారు.