July 23, 2026

అత్తాపూర్‌‌లో 8.41 కేజీల గంజాయి స్వాధీనం.. ఆరుగురు నిందితులు అరెస్ట్

అత్తాపూర్‌‌లో 8.41 కేజీల గంజాయి స్వాధీనం.. ఆరుగురు నిందితులు అరెస్ట్
Reading Time: < 1 minute

అత్తాపూర్‌‌లో 8.41 కేజీల గంజాయి స్వాధీనం.. ఆరుగురు నిందితులు అరెస్ట్

Caption of Image.

గండిపేట, వెలుగు: గంజాయి విక్రయాలకు పాల్పడుతున్న ముఠాను అత్తాపూర్ పోలీసులు, రాజేంద్రనగర్ ఎస్‌‌ఓటీ బృందం పట్టుకున్నారు. ఈ కేసులో ఆరుగురు నిందితులను అరెస్ట్ చేశారు. పోలీసుల వివరాల ప్రకారం.. సోమవారం రాజేంద్రనగర్ రోడ్డులోని భోపాల్‌‌నగర్ అటవీ ప్రాంతం సమీపంలోని హనుమాన్ దేవాలయం వద్ద పోలీసులు దాడులు నిర్వహించారు. ఈ సమయంలో బైక్​పై గంజాయితో వచ్చిన వ్యక్తితో పాటు కొనుగోలు చేసేందుకు వచ్చిన మరో ఐదుగురిని అదుపులోకి తీసుకున్నారు. 

మహమ్మద్ ఫైజాన్ బక్షి.. మహారాష్ట్రలోని నాగ్‌‌పూర్‌‌కు చెందిన సైలేష్ వద్ద 8.5 కిలోల గంజాయి కొని రాజేంద్రనగర్‌‌కు చెందిన సయ్యద్ సాదిక్‌‌కు విక్రయించాడు. మిగిలిన నిందితులు సొంత వినియోగంతో పాటు ఇతరులకు విక్రయించేందుకు గంజాయి కొనేందుకు వచ్చారు. గంజాయిని స్వాధీనం చేసుకుని మహమ్మద్ ఫైజాన్ బక్షి, సయ్యద్ సాదిక్, అలీ అహ్మద్, రియాజ్ అహ్మద్ ఖాన్, మొహమ్మద్ జాఫర్, తౌసీఫ్ బైగ్‌‌లను పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రధాన సరఫరాదారు సైలేష్ పరారీలో ఉన్నాడు.
 

©️ VIL Media Pvt Ltd.