July 23, 2026

Light Flip 5G Phone: సోషల్ మీడియా లేని 5G ఫోన్.. 50MP కెమెరాతో Light Flip కొత్త కాన్సెప్ట్.!

Light Flip 5G Phone: సోషల్ మీడియా లేని 5G ఫోన్.. 50MP కెమెరాతో Light Flip కొత్త కాన్సెప్ట్.!
Reading Time: 2 minutes
Light Flip 5g Phone Launched No Social Media Lightos 50mp Camera And 5g Connectivity

Light Flip 5G Phone Launched: డిజిటల్ ప్రపంచానికి కాస్త దూరంగా ఉండాలనుకునే వినియోగదారుల కోసం లైట్ (Light) కంపనీ నుండి కొత్త Light Flip 5G ఫోన్‌ను లాంచ్ చేసింది. ఆధునిక స్మార్ట్‌ఫోన్‌లకు ప్రత్యామ్నాయంగా రూపొందించిన ఈ మినిమలిస్ట్ ఫోన్‌లో సోషల్ మీడియా యాప్‌లు, వెబ్ బ్రౌజర్, ప్రకటనలతో నిండిన యాప్‌లు వంటి దృష్టి మరల్చే ఫీచర్లకు చోటు ఇవ్వలేదు. క్లాసిక్ క్లామ్‌షెల్ (Flip) డిజైన్‌తో పాటు కొత్త హార్డ్‌వేర్‌ను చేర్చి, అవసరమైన పనులకే పరిమితమైన డిజిటల్ అనుభవాన్ని అందించేలా ఈ ఫోన్‌ను రూపొందించింది.

ఇందులో కంపెనీ అభివృద్ధి చేసిన LightOS ఆపరేటింగ్ సిస్టమ్‌ను అందించారు. ఈ ఆపరేటింగ్ సిస్టమ్‌లో సోషల్ మీడియా, వెబ్ బ్రౌజర్ లేదా నిరంతరం నోటిఫికేషన్‌లతో ఇబ్బంది పెట్టే యాప్‌లు ఉండవు. బదులుగా రోజువారీ అవసరాలకు ఉపయోగపడే ఫీచర్లపై మాత్రమే దృష్టి పెట్టారు. Predictive T9 టైపింగ్, Voice-to-Text, ఆడియో మెసేజింగ్, 9 స్పీడ్ డయల్ షార్ట్‌కట్‌లు వంటి కమ్యూనికేషన్ టూల్స్ ఇందులో ఉన్నాయి.

వినియోగదారుల దైనందిన అవసరాలను దృష్టిలో ఉంచుకుని Light Flipలో అలారం, క్యాలెండర్, కాలిక్యులేటర్, డైరెక్టరీ, నావిగేషన్, మొబైల్ హాట్‌స్పాట్, మ్యూజిక్ ప్లేయర్, నోట్స్, వాయిస్ మెమో, పోడ్‌కాస్ట్, వాతావరణ సమాచారం, 2FA ఆథెంటికేటర్, టైమర్ వంటి పలు ఉపయోగకరమైన టూల్స్‌ను అందించారు. అలాగే డెవలపర్ ప్రోగ్రామ్ ద్వారా కమ్యూనిటీ రూపొందించే ఓపెన్ సోర్స్ టూల్స్‌కు కూడా సపోర్ట్ ఉంటుంది.

Light Flipలో 2.8 అంగుళాల OLED డిస్‌ప్లే (480×640 పిక్సెల్స్)ను మ్యాట్ ఫినిష్‌తో అందించారు. MediaTek MT8873 ఆక్టా-కోర్ ప్రాసెసర్, 6GB LPDDR4X RAM, 128GB UFS 2.2 ఇంటర్నల్ స్టోరేజ్ తో ఈ ఫోన్ పనిచేస్తుంది. ఫొటోగ్రఫీ కోసం 50MP రియర్ కెమెరాను అందించారు. ఇది 12MP ఫొటోలను క్యాప్చర్ చేయగలదు. కెమెరాతో పాటు ఇంటిగ్రేటెడ్ ఫ్లాష్‌లైట్ కూడా ఉంది. కనెక్టివిటీ పరంగా 5G, Dual 4G VoLTE, Wi-Fi 6, Bluetooth 5.0, GPS, GLONASS, USB Type-C పోర్ట్‌ను అందించారు. అలాగే 3.5mm హెడ్‌ఫోన్ జాక్, స్టీరియో స్పీకర్లు, IP54 డస్ట్ & స్ప్లాష్ రెసిస్టెన్స్, 1800mAh రీప్లేస్ చేయగల బ్యాటరీ వంటి ఫీచర్లు కూడా ఉన్నాయి.

Light Flipను నలుపు, నేవీ, ఎరుపు, గులాబీ, పసుపు, లేత బూడిద రంగుల్లో మార్కెట్లోకి తీసుకురానున్నారు. అంతేకాకుండా ఫోన్‌కు చార్మ్స్ లేదా యాక్సెసరీలు అమర్చుకునేందుకు ప్రత్యేక లూప్‌ను కూడా ఏర్పాటు చేశారు. దీని ధర 299 అమెరికన్ డాలర్లు (రూ.28,870). అలాగే కంపెనీ సర్వీస్ ప్లాన్‌తో నెలకు 39 డాలర్ల EMI ఆప్షన్ కూడా అందుబాటులో ఉంటుంది. ప్రస్తుతం ఈ ఫోన్‌కు ప్రీ-బుకింగ్‌లు ప్రారంభమయ్యాయి. డెలివరీలు నాలుగు విడతల్లో జరగనున్నాయి. తొలి విడత 2027 ఏప్రిల్ ప్రారంభంలో, రెండో విడత ఏప్రిల్ చివర్లో, మూడో విడత మే ప్రారంభంలో, నాలుగో విడత మే చివర్లో వినియోగదారులకు అందించనున్నారు.