అత్యవసరంగా ఎక్కడికైనా వెళ్లాలనుకుంటే అందరికీ గుర్తొచ్చే పేరు తత్కాల్. రైళ్లల్లో ట్రైన్ బయల్దేరడానికి కొద్ది గంటల ముందు ఈ టికెట్లను బుక్ చేసుకుని సౌకర్యవంతమైన ప్రయాణం చేయవచ్చు. మాములుగా రైల్వే టికెట్లను కొద్ది రోజుల ముందు బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. అప్పుడే మీకు రిజర్వేషన్ టికెట్లు దొరుకుతాయి. అయితే తాత్కాల్ కోటాలో కొద్ది గంటల ముందు టికెట్లను బుక్ చేసుకుని ప్రయాణించవచ్చు.
తత్కా్ల్ టికెట్లు ఓపెన్ చేయగానే కొన్ని నిమిషాల వ్యవధిలోనే ఫుల్ అయిపోతాయి. దీంతో నిమిషాల వ్యవధిలోనే మీరు బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. మీరు టికెట్లను విడుదల చేయగానే వెంటనే బుక్ చేసుకోవాలంటే ముందుగా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ముందుగా ఐఆర్సీటీసీ అకౌంట్లోకి లాగిన్ అయ్యి అన్నీ యాక్టివ్‌గా ఉన్నాయా.. లేదా అనేది చూసుకోండి. ఇక ఆధార్ వెరిఫికేషన్ పూర్తి చేయండి.
ఇక పేర్లు, వయస్సు, ఇతర వివరాలను ఆటోఫిల్ చేసేందుకు మాస్టర్ లిస్టును భద్రపర్చుకోండి. ఇక పేమెంట్స్ కోసం యూపీఐ, క్రెడిట్, డెబిట్ కార్డులు, నెట్ బ్యాంకింగ్, ఐఆర్సీటీసీ వ్యాలెట్ లాంటి వాటిని ముందే లింక్ చేసుకోండి. వివరాలు, పేమెంట్స్ ముందు లింక్ చేసి ఉంచుకోవడం వల్ల తత్కాల్ టికెట్లు వెంటనే బుక్ చేసుకోవచ్చు. అప్పటికప్పుడు టైప్ చేయడం, చెల్లింపు సమాచారం వెతకడంలో ఆలస్యం జరగకుండా ఉంటుంది.
తత్కాల్ టికెట్లను ట్రైన్ బయల్దేరడానికి ఒక రోజు ముందు రిలీజ్ చేశారు. ఏసీ క్లాసులకు ఉదయం 10 గంటలకు రిలీజ్ చేస్తారు. ఇక స్లీపర్, ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాస్ టికెట్లను ఉదయం 11 గంటలకు విడుదల చేస్తారు. కనీసం ఈ సమాయానికి 5 నుంచి 10 నిమిషాల ముందు లాగిన్ అవ్వండి. పేజీని ముందుగానే లోడ్ చేసి సిద్దంగా ఉంచుకోండి. దీని వల్ల మీరు పని సులభం అవుతుంది. మీరు కొన్ని సెకన్లు లేట్ చేసినా టికెట్ కోల్పోవచ్చు.
ఇక ఒకే రైలుపై మీరు ఆశలు పెట్టుకుని దారి కోసం చూడవచ్చు. అదే మార్గంలో వెళ్లే 2, 3 ప్రత్యామ్నాయ రైళ్లను గుర్తించండి. ఒకే కేటగిరీ రైళ్లు కాకుండా బహుళ కోచ్‌లను అందించే రైళ్లను ఎంచుకోండి. డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్ పేమెంట్స్ కంటే యూపీఐ, ఐఆర్సీటీసీ ద్వారా పేమెంట్స్ వేగంగా జరుగుతాయి. వాటిని ఎంచుకోవడం వల్ల మీ పని సులువవుతుంది.




