Reading Time: < 1 minute

ఛార్జింగ్ పెట్టిన 10 నిమిషాలకే.. పేలిన  ఎలక్ట్రిక్ స్కూటీ. . పూర్తిగా దగ్ధం

Caption of Image.

జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలోని సాయిరాంపూర్ కాలనీలో ఛార్జింగ్‌లో ఉన్న ఎలక్ట్రిక్ స్కూటీ ఒక్కసారిగా పేలిపోయింది. ఛార్జింగ్ పెట్టిన సుమారు 10 నిమిషాలకే పెద్ద శబ్దంతో పేలుడు సంభవించింది.  పేలుడు అనంతరం స్కూటీకి మంటలు అంటుకుని వేగంగా వ్యాపించాయి. దీంతో అప్రమత్తమైన వాహనదారుడు వెంటనే స్పందించి మంటల్లో కాలిపోతున్న స్కూటీపై నీళ్లు చల్లి మంటలను అదుపులోకి తీసుకొచ్చాడు.

ఈ ఘటనలో స్కూటీ పూర్తిగా దగ్ధమైంది. అయితే సకాలంలో స్పందించడంతో మంటలు ఇతర వాహనాలు లేదా సమీప ప్రాంతాలకు వ్యాపించకుండా పెను ప్రమాదం తప్పింది.దగ్ధమైన వాహనం ఎలేస్కో కంపెనీకి చెందిన ఎలక్ట్రిక్ స్కూటీగా గుర్తించినట్లు సమాచారం.

ఛార్జింగ్ సమయంలోనే పేలుడు సంభవించడంతో స్థానికులు ఆందోళనకు గురయ్యారు. ఘటనకు సంబంధించిన పూర్తి కారణాలు, స్కూటీ బ్యాటరీ లేదా ఛార్జింగ్ వ్యవస్థలో ఏదైనా సాంకేతిక లోపం ఉందా అనే విషయాలు అధికారికంగా నిర్ధారించాల్సి ఉంది.

 

 

©️ VIL Media Pvt Ltd.