Reading Time: < 1 minute

ఇప్పుడు ఉన్న కోటి రూపాయలు.. 20 ఏళ్ల తర్వాత 30 లక్షలకు తగ్గిపోతుందా..!

Caption of Image.

కోటి రూపాయలు అనగానే ప్రస్తుత కాలంలో చూడటానికి, వినటానికి పెద్ద మొత్తంగా కనిపిస్తుంది. చాలా మంది దీన్ని తమ జీవితకాలపు ఆర్థిక లక్ష్యంగా నిర్దేశించుకుంటారు. కానీ ద్రవ్యోల్బణం కారణంగా కాలక్రమేణా డబ్బు విలువ నిశ్శబ్దంగా కరిగిపోతుంది. ఏటా ద్రవ్యోల్బణం సుమారు 6 శాతం ఉంటే.. ప్రస్తుతం కోటి రూపాయలతో కొనగలిగే వస్తువుల విలువ 20 ఏళ్ల తర్వాత మూడింట ఒక వంతుకు పడిపోతుంది. కాగితంపై అది కోటి రూపాయలే అయినప్పటికీ.. దాని వాస్తవ కొనుగోలు శక్తి మాత్రం చాలా మేర ఆవిరైపోతుంది.

దీనివల్ల దీర్ఘకాలిక ఆర్థిక ప్రణాళికలు కేవలం ఒక నిర్దిష్ట కార్పస్ మొత్తాన్ని కూడబెట్టడంతోనే ఆగిపోకూడదు. 20 ఏళ్ల తర్వాత ఆ డబ్బు వాస్తవంగా ఎంత కొనుగోలు శక్తిని కలిగి ఉంటుందో అంచనా వేయడం చాలా ముఖ్యం. ఉదాహరణకు.. ప్రస్తుతం కోటి రూపాయలు ఖర్చయ్యే అవసరాలకు, భవిష్యత్తులో ద్రవ్యోల్బణం కారణంగా అదే స్థాయి అవసరాలను తీర్చుకోవడానికి ఎక్కువ డబ్బులు అవసరం అవుతాయి.

ఏటా 6 శాతం ద్రవ్యోల్బణంతో 20 ఏళ్ల కాలంలో ఖర్చులు సుమారు రూ.2కోట్ల 20 లక్షలకు పెరుగుతాయి. సో ప్రస్తుత కోటి రూపాయల విలువైన అవసరాలు 20 ఏళ్ల తర్వాత సుమారు రూ.3కోట్ల 20లక్షలు అవుతాయి. అంటే కేవలం ద్రవ్యోల్బణం కారణంగానే ఖర్చులో అదనంగా 2.2 కోట్ల రూపాయల భారం పడుతుంది. అంటే ఇప్పుడు మీ చేతిలో ఉన్న కోటి రూపాయల విలువ క్యాష్ రూపంలో ఉంచుకుంటే దాదాపు రూ.30 లక్షలకు పడిపోతుందన్నమాట 20 ఏళ్లలో. 

దీని అర్థం ఏమిటంటే.. మీరు భవిష్యత్తులో ఒక లక్ష్యం కోసం కోటి రూపాయలు ఆదా చేస్తుంటే.. మీరు వాస్తవానికి వెనుకబడిపోతున్నారు. బ్యాంకు ఖాతాలో మీ డబ్బు అలాగే ఉంటుంది కానీ దాని కొనుగోలు శక్తి మాత్రం తగ్గిపోతుంది. అందుకే దీర్ఘకాలిక ప్రణాళికలు వేసుకునేటప్పుడు పన్ను భారాన్ని మాత్రమే కాకుండా, ద్రవ్యోల్బణ ప్రభావాన్ని కూడా తప్పనిసరిగా పరిగణలోకి తీసుకోవాలి డబ్బు విషయంలో. దీనిని క్లారిటీగా అర్థం చేసుకుంటే మీరు భవిష్యత్తులో అవసరాల కోసం సరైన రీతిలో డబ్బును లెక్కించి దాచుకోగలరు. లేదంటే పెరిగే రేట్లకు, మీ ఆర్థిక ప్రణాళికలకు మధ్య పొంతన లేకుండా పోతుంది. 

©️ VIL Media Pvt Ltd.