Reading Time: < 1 minute

ఖైరతాబాద్ బైపోల్‌లో దిమ్మతిరిగే రిజల్ట్ ..ఎవరు కొడితే మైండ్ బ్లాక్ అవుతుందో అలా దెబ్బపడుతది: దానం నాగేందర్

Caption of Image.

ఖైరతాబాద్ అసెంబ్లీ ఉపఎన్నికపై కాంగ్రెస్ నేత దానం నాగేందర్  కీలక  వ్యాఖ్యలు చేశారు. ఖైరతాబాద్ బైపోల్‌లో దిమ్మతిరిగే రిజల్ట్ వస్తుందని, ఎవరు కొడితే మైండ్ బ్లాక్ అవుతుందో అలా దెబ్బపడుతుందని వ్యాఖ్యానించారు. ఖైరతాబాద్ సెగ్మెంట్‌పై తన ప్రభావం ఉండదన్న ప్రచారాన్ని ఆయన కొట్టిపారేశారు. అదే సమయంలో ఎన్నికల వ్యవహారంపై బీజేపీ, కేంద్ర ఎన్నికల సంఘంపై తీవ్ర ఆరోపణలు చేశారు.

సికింద్రాబాద్ లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ నేత కిషన్ రెడ్డి ఓటు చోరీ కారణంగానే గెలిచారని దానం నాగేందర్ ఆరోపించారు. సీఈసీని అడ్డుపెట్టుకుని బీజేపీ ఓట్ చోరీ చేస్తోందని ఆయన ఆరోపించారు. సీఈసీ  అధికారి జ్ఞానేశ్‌ రాజీనామా చేయాలని దానం డిమాండ్ చేశారు. ఈ అంశంలో సుప్రీంకోర్టు జోక్యం చేసుకోవాలని కూడా ఆయన కోరారు.

2023 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో దానం నాగేందర్ బీఆర్‌ఎస్ తరఫున ఖైరతాబాద్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. అనంతరం 2024 లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున సికింద్రాబాద్ నియోజకవర్గం నుంచి పోటీ చేశారు. దానం పార్టీ మార్పుపై ఎమ్మెల్యే పదవిపై అనర్హత వేటు వేయాలని కోరుతూ హైకోర్టు ఇటీవల ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే.  

 

 

©️ VIL Media Pvt Ltd.