
నటనలో కెరీర్ బిల్డ్ చేసుకుందామని అనుకుంది ఆ యువతి. ఎన్నో ప్రయత్నాలు చేసింది. సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ గా పాపులర్ అయ్యింది. అయినా నటనపై తన ప్యాషన్ ను కొనసాగిస్తూ ముందుకు సాగుతోంది. అంతలోనే ఆత్మహత్య చేసుకోవడం తీవ్ర విషాదాన్ని నింపింది. తమ అభిమాన నటి లేదనే వార్త తెలిసి ఆమె ఫాలోవర్లు కండోలెన్స్ మెస్సేజ్ లతో సోషల్ మీడియాను నింపేస్తున్నారు.
మధ్యప్రదేశ్ సింగ్రాలి జిల్లాకు చెందిన నిధి తివారీ (30) ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. మొర్వా పోలీస్ స్టేషన్ పరిధిలోని భూసా మోడ్ లో ఏరియాలో నివసిస్తున్న నిధి తివారీ సోషల్ మీడియాలో తనదైన నటనతో ఫేమస్ అయ్యింది.
16 లక్షల ఫాలోవర్లు:
నిధి తివారీకి ఫేస్ బుక్ లో 9 లక్షల ఫాలోవర్లు, ఇన్ స్టాలో 7 లక్షల ఫాలోవర్లు ఉన్నారు. వింధ్యా ప్రాంతంలో ఆమె చాలా ఫేమస్. ఆమె వీడియోలకు మిలియన్స్ లో రీచ్ వస్తే.. వేలల్లో రియాక్షన్స్ వస్తుంటాయి.
2024లో మిస్ ప్రెట్టీ ఇండియా టైటిల్ గెలుచుకున్నాక ఆమె పాపులారిటీ ఇండియా వ్యాప్తంగా పెరిగిపోయింది.
నటనే జీవితం..
సోషల్ మీడియా ఆమెకు ఒక వేదిక మాత్రమే.. కానీ ఆమె ఆశయం పెద్ద నటిగా కెరీర్ బిల్డ్ చేసుకోవడం.. సినీ పరిశ్రమలో సెటిల్ అవ్వడం అని స్థానికులు చెబుతున్నారు. మోడలింగ్, ఈవెంట్స్, డిజిటల్ కంటెంట్ క్రియేషన్ తో ముందుకు సాగుతున్నారు. ఆమె పేజ్ లో ఎక్కువ సినిమాపై ఉన్న ఆసక్తికి సంబంధించి పోస్టులు ఉంటాయని అంటున్నారు.
పేరెంట్స్ చెప్పిన వివరాల ప్రకారం.. 2026 సెప్టెంబర్ 26 సాయంత్రం.. ఉరివేసుకుని చనిపోయే ముందు ఆమె ఎవరితోనో మాట్లాడుతుందని తెలిపారు. హాస్పిటల్ కు తరలించినా ఆమె అప్పటికే చనిపోయినట్లు డాక్టర్లు నిర్ధారించారు. ఆమె ఫోన్ లో ఎవరితో మాట్లాడారు.. కాల్ రికార్డింగ్స్ లో ఏముంది అనే కోణంలో విచారణ చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
సోషల్ మీడియాలో మెస్సేజ్ ల వరద..
నిధి చనిపోయిన వార్త బయటకు రాగానే, సోషల్ మీడియా కండోలెన్స్ మెస్సే్ లతో నిండిపోయింది. ఒకప్పుడు ఆమె అందం, కాన్ఫిడెన్స్, సక్సెస్ ను ప్రశంసిస్తూ ఉన్న పోస్టులు ఇప్పుడు నివాళులు, సంతాప సందేశాలతో నిండిపోయాయి. జిల్లాకు జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చిన కుమార్తెను సింగ్రౌలి కోల్పోయిందని చాలామంది పోస్టులు చేస్తున్నారు.