July 14, 2026

ODI World Cup 2027: వన్డే ప్రపంచకప్‌ జట్టులో టీ20 వరల్డ్ కప్ హీరోలకి నో ఛాన్స్.. ఏకంగా 8 మంది ఔట్

ODI World Cup 2027: వన్డే ప్రపంచకప్‌ జట్టులో టీ20 వరల్డ్ కప్ హీరోలకి నో ఛాన్స్.. ఏకంగా 8 మంది ఔట్
Reading Time: 2 minutes

ODI World Cup 2027: వన్డే ప్రపంచకప్‌ జట్టులో టీ20 వరల్డ్ కప్ హీరోలకి నో ఛాన్స్.. ఏకంగా 8 మంది ఔట్

Caption of Image.

ODI World Cup 2027: దక్షిణాఫ్రికా, జింబాబ్వే మరియు నమీబియా సంయుక్త వేదికలలో జరగనున్న 2027 వన్డే ప్రపంచకప్‌ కోసం భారత క్రికెట్ నియంత్రణ మండలి ఇప్పుడే ప్రణాళికలు సిద్ధం చేస్తుంది. 2026 టీ20 వరల్డ్ కప్‌లో న్యూజిలాండ్‌ను ఓడించి ట్రోఫీ గెలిచిన జోరులో ఉన్న టీమిండియా, వన్డే జట్టులో సమూల మార్పులు చేసేందుకు రెడీ అయింది. వన్డే క్రికెట్ లో ఓపికతో పాటు ఇన్నింగ్స్‌ను నిర్మించే వారిపై బీసీసీఐ మొగ్గు చూపుతోంది.

టీ20 ప్రపంచకప్‌లో అద్భుతంగా ఆడిన సంజూ శాంసన్, ఇషాన్ కిషన్, తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్, అభిషేక్ శర్మ, శివమ్ దూబే, రింకూ సింగ్, వాషింగ్టన్ సుందర్ లాంటి  ప్లేయర్స్ కి 2027 వన్డే జట్టులో చోటు దక్కే అవకాశం కనిపించడం లేదు. వీరందరూ కేవలం టీ20 స్పెషలిస్టులుగానే ముద్రపడటం, వన్డే ఫార్మాట్‌కు అవసరమైన నిలకడ వీరిలో లేకపోవడంతో ఈ 8 మంది ఆటగాళ్ల ఎంపికపై తీవ్ర ప్రభావం చూపిస్తుంది. కానీ, రాబోయే దేశవాళీ, ద్వైపాక్షిక సిరీస్‌లలో వీళ్లందరూ అద్భుతంగా రాణిస్తే తప్ప వన్డే జట్టులోకి పునరాగమనం చేయడం కష్టమే.

భవిష్యత్తు సారథిగా శుభ్‌మన్ గిల్‌ను రెడీ చేయాలని బీసీసీఐ సెలక్టర్లు భావిస్తున్నారు. గిల్ ఇప్పటికే తన బ్యాటింగ్, నాయకత్వ లక్షణాలతో ముందుకు నడుస్తున్నాడు. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ సిరీస్‌లలో ఆశించిన ఫలితాలను రాబట్టకపోయినప్పటికీ, సుదీర్ఘ కాలం పాటు జట్టును నడిపించే సామర్థ్యం అతడికి ఉందని జట్టు యాజమాన్యం నమ్ముతుంది. ఓపెనర్‌గా శుభ్‌మన్ చేసే పరుగులు జట్టుకు అత్యంత కీలకం అయ్యే ఛాన్స్ ఉంది. 

రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీల ఫామ్ జట్టుకు ప్లస్ కానుంది. వన్డే ఫార్మాట్లో కోహ్లీ స్థిరత్వం, రోహిత్ దూకుడు 2027లోనూ టీమిండియాకు అవసరమని క్రికెట్ పండితులు పేర్కొంటున్నారు.  వీరిద్దరూ ఫిట్‌నెస్‌ కాపాడుకుంటే తుది జట్టులో ఉండటం పక్కా.. మరోవైపు కేఎల్ రాహుల్ వికెట్ కీపర్‌గా, జస్ప్రీత్ బుమ్రా ప్రధాన బౌలర్‌గా టీమ్ కి బ్యాక్ బోన్ లా నిలిచే అవకాశం ఉంది. 

టీమిండియా 2027 వరల్డ్ కప్ జట్టు అంచనా: శుభ్‌మన్ గిల్ (కెప్టెన్), రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, రిషబ్ పంత్, కేఎల్ రాహుల్, హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, రవీంద్ర జడేజా, జస్ప్రీత్ బుమ్రా, కుల్దీప్ యాదవ్, అర్ష్‌దీప్ సింగ్, ప్రసిద్ధ్ కృష్ణ, హర్షిత్ రాణా. 
 

©️ VIL Media Pvt Ltd.