Reading Time: < 1 minute
Sharwanand Sentiment Can Biker Continue His Sankranti And Uv Creations Hit Streak

UV Creations Hit Streak With Sharwanand: ఛార్మింగ్ స్టార్‌ శర్వానంద్‌కు సంక్రాంతి సెంటిమెంట్ బాగా వర్కౌటౌతోంది. పొంగల్‌కు వచ్చిన ప్రతిసారి హిట్ కొడుతున్నాడు. నెక్ట్స్ పండుగకు కూడా ప్లాన్ చేసుకుంటున్నాడు. అయితే ‘బైకర్’ పండుగకు రాకపోయినా.. బంపర్ బ్లాక్ బస్టర్ కొట్టబోతున్నానని కాన్ఫిడెన్స్‌గా చెబుతున్నాడు శర్వా. ఆ కాన్ఫిడెన్స్‌కు కంటెంట్‌పై నమ్మకమా? లేదా మరో సెంటిమెంటా?.

సంక్రాంతికి వచ్చిన ప్రతిసారి శర్వానంద్ సక్సెస్ టేస్ట్ చేస్తున్నాడు. 2016లో సంక్రాంతికి వచ్చిన ‘ఎక్స్ ప్రెస్ రాజా’ హిట్టుగా నిలిస్తే.. 2017లో పొంగల్‌కు రిలీజైన ‘శతమానం భవతి’ బ్లాక్ బస్టర్ హిట్ అయింది. తాజాగా వచ్చిన ‘నారీ నారీ నడుమ మురారి’ కూడా డీసెంట్ హిట్ అందుకుంది. సో ఛార్మింగ్ స్టార్‌కు పండుగ ఓ సెంటిమెంట్‌గా మారింది. నెక్ట్స్ శ్రీను వైట్లతో కలిసి 2027 సంక్రాంతిని టార్గెట్ చేస్తున్నాడు శర్వా.

సంక్రాంతికి హిట్ కొట్టిన శర్వానంద్.. ‘బైకర్‌’తో ఏప్రిల్ 3న ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. బైక్ రైసర్ పాత్రలో ఒదిగిపోయాడు ఛార్మింగ్ స్టార్. దేశం మొత్తం మాట్లాడుకునే మూవీ తీశామన్న శర్వా.. ‘నారీ నారీ నడుమ మురారికి చెప్పి మరీ హిట్ కొట్టా. ఇప్పుడీ సినిమాతో బంపర్ బ్లాక్ బస్టర్ హిట్ కొడతా’ అని చెబుతున్నాడు. ఈసారి పొంగల్ సెంటిమెంట్ లేకపోయినా.. కంటెంట్‌‌పై నమ్మకంతో కాన్ఫిడెన్స్‌గా స్టేట్ మెంట్ పాస్ చేశాడు.

Also Read: Mamitha Baiju Offers: స్కైని తాకిన మమితా పాపులారిటీ.. కాల్షీట్స్ కోసం క్యూకడుతున్న ఫిల్మ్ మేకర్స్‌!

శర్వానంద్ బైకర్ పొంగల్ సెంటిమెంట్ మిస్సైనా.. యువీ ప్రొడక్షన్స్ రూపంలో మరో సెంటిమెంట్ యాడయ్యింది. యువీ నిర్మాణ సంస్థలో శర్వా త్రీ ఫిల్మ్ చేశాడు. రన్ రాజా రన్, ఎక్స్ ప్రెస్ రాజా, మహానుభావుడు చిత్రాలు రాగా.. మూడు మంచి హిట్స్ అందుకున్నాయి. బైకర్ యువీతో ఫోర్త్ మూవీ రాబోతోంది. ఈ సెంటిమెంట్ బైకర్ విషయంలో వర్కౌట్ అయితే.. మరో బ్లాక్ బస్టర్ శర్వా ఖాతాలో పడినట్లే. చూడాలి మరి ఏం జరుగుతుందో.