July 14, 2026

PSL 2026: పాకిస్తాన్కి బంగ్లా గట్టి షాక్.. PSL ఆడేందుకు నో పర్మిషన్

PSL 2026: పాకిస్తాన్కి బంగ్లా గట్టి షాక్.. PSL ఆడేందుకు నో పర్మిషన్
Reading Time: < 1 minute

PSL 2026: పాకిస్తాన్కి బంగ్లా గట్టి షాక్.. PSL ఆడేందుకు నో పర్మిషన్

Caption of Image.

PSL 2026: పాకిస్థాన్ క్రికెట్ బోర్డుకు బంగ్లాదేశ్ గట్టి షాక్ ఇచ్చింది. ఢాకా క్రీడా మంత్రి అమినూల్ హక్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. భద్రతా కారణాలతో పాకిస్థాన్ సూపర్ లీగ్ (పీఎస్‌ఎల్ 2026) టోర్నమెంట్ కి తమ ప్లేయర్స్ ని దూరంగా ఉంచాలనే యోచనలో బీసీబీ ఉన్నట్లు తెలుస్తుంది. టీ20 వరల్డ్ కప్ 2026 సమయంలో తమకు అండగా నిలిచిన పాక్‌కు బంగ్లాదేశ్ ఇలా దిమ్మతిరిగే షాక్ ఇచ్చేందుకు సిద్ధమైంది. 

పీఎస్‌ఎల్– 2026 సీజన్‌‌లో పాల్గొనేందుకు బంగ్లాదేశ్‌కు చెందిన ముస్తాఫిజుర్ రెహ్మాన్, పర్వేజ్ హోస్సైన్, షోరిఫుల్ ఇస్లాం, నహిద్ రాణా, తంజిద్ హసన్ తమీమ్, రిషాద్ హోస్సైన్‌లకు బీసీబీ ఎన్‌ఓసీ ఇవ్వలేదు. కానీ ఆఫ్ఘనిస్థాన్, పాకిస్థాన్ మధ్య జరుగుతున్న యుద్ధంతో ప్రస్తుతం నెలకొన్న అస్థిర పరిస్థితులతో బంగ్లా ప్రభుత్వం తమ ప్లేయర్స్ ని పంపేందుకు ఆలోచిస్తుంది. ‘మా ఆటగాళ్ల భద్రత విషయంలో చిన్నపాటి సందేహం ఉన్నా.. వారిని పాకిస్థాన్‌కు పంపమని.. దీనిపై ముందుగా బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు పూర్తిస్థాయిలో విశ్లేషణ చేసిన తర్వాత నివేదిక ఇవ్వాల్సి ఉంటుంది. అనంతరం జాతీయ భద్రతా సంస్థల సలహా మేరకు బంగ్లా సర్కార్ తుది నిర్ణయం తీసుకుంటుందని ఆ దేశ క్రీడా శాఖ మంత్రి అమినూల్ హక్ తేల్చి చెప్పారు. 

►ALSO READ | MS Dhoni Retirement: ధోనీ ఇంపాక్ట్ ప్లేయర్‌గా ఆడటం కంటే రిటైర్ కావడమే బెటర్.. 

మిడిల్ ఈస్టులో యుద్ధంతో పాకిస్తాన్ లో ఇంధనం దొరకకపోవడంతో పాటు భద్రతా కారణాలతో పీఎస్‌ఎల్ 2026ను ప్రేక్షకులు లేకుండానే కరాచీ, లాహోర్ స్టేడియాల్లోనే నిర్వహిస్తామని పీసీబీ వెల్లడించింది. లీగ్ మ్యాచ్‌లకు ప్రేక్షకులకు పర్మిషన్ లేదని స్పష్టం చేసింది. ఈ ప్రకటనతో పీఎస్‌ఎల్ ఆడేందుకు విదేశీ ప్లేయర్స్ ఆలోచిస్తున్నారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో జరిగిన పొట్టి వరల్డ్ కప్ సమయంలో బంగ్లాదేశ్‌కు అండగా నిలిచిన పాక్ క్రికెట్ బోర్డుకు ఇప్పుడు షాక్ ఇచ్చేందుకు రెడీ అయింది. మే26 నుంచి పీఎస్ఎల్ ప్రారంభం కాబోతుంది.  

©️ VIL Media Pvt Ltd.