July 14, 2026

Fake IAS Groom: మ్యాట్రిమోని పరిచయం.. భార్యను గోవాలో అమ్మే ప్లాన్..

Fake IAS Groom: మ్యాట్రిమోని పరిచయం.. భార్యను గోవాలో అమ్మే ప్లాన్..
Reading Time: < 1 minute
Fake Ias Groom Arrested Gorakhpur Matrimony Fraud Case

Fake IAS Groom: ఉత్తర్ ప్రదేశ్‌లోని గోరఖ్‌పూర్‌లో ఫేక్ ఐఏఎస్ కేసు సంచలనంగా మారింది. మ్యాట్రిమోని సైట్ ద్వారా పరిచయమైన ఒక యువకుడు తనను తాను ఐఏఎస్ అధికారిగా చెప్పుకుని ఒక అమ్మాయిని వివాహం చేసుకుని మోసానికి పాల్పడ్డాడు. ఇటావాకు చెందిన ప్రీతమ్ నిషాద్ అనే యువకుడు తాను ఐఏఎస్ అధికారినని, మణిపూర్ కేడర్‌లో పోస్టింగ్ అని నమ్మించేందుకు నకిలీ ఫోటోలు, ఇంటర్వ్యూ వివరాలు చూపించి అమ్మాయి కుటుంబాన్ని బుట్టలో వేసుకున్నాడు.

Read Also: UAPA: “దేశానికి వ్యతిరేకంగా యుద్ధం”.. కాశ్మీర్ వేర్పాటువాది ఆసియా అంద్రబీకి జీవితఖైదు..

మొదట్లో కట్నం వద్దంటూనే, పెళ్లి ఖర్చుల పేరుతో రూ. 15 లక్షలు డిమాండ్ చేశాడు. ఎంగేజ్మెంట్ సమయంలో రూ. 10 లక్షలు, పెళ్లి రోజున మరో రూ.5 లక్షలు అమ్మాయి వారు ముట్టచెప్పారు. అయితే, పెళ్లికి యువతి కుటుంబం రూ. 30 లక్షలు ఖర్చు చేసి ఘనంగా వివాహం జరిపించారు. మార్చి 11న ఘనంగా పెళ్లి జరిగింది. ఇదిలా ఉంటే, మరుసటి రోజే వరుడు అసలు ఐఏఎస్ అధికారి కాదని సమాచారం రావడంతో కుటుంబం షాక్ అయింది.

వెంటనే ఇటావా వెళ్లి చూస్తే యువతి ఒక చిన్న గదిలో ఉండగా, నిందితుడు అక్కడి నుంచి పారిపోయాడు. వెంటనే అమ్మాయిన సురక్షితంగా రక్షించారు. దీని తర్వాత పోలీసులకు ఫిర్యాదు చేుశారు. పోలీసులు విచారణలో మరిన్ని షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి. పెళ్లి తర్వాత యువతిని గోవాకు తీసుకెళ్లి అక్కడ అమ్మాలని ప్లాన్ చేసినట్లు తేలింది. నిందితుడిని జాలౌన్‌లో పోలీసులు అరెస్ట్ చేశారు. అతను ఐఏఎస్ కాదని, బీఎస్సీ మాత్రమే చదివినట్లు తెలిసింది.ఇలాగే ఇద్దరు మహిళల్ని మోసం చేసినట్లు నిందితుడు ఒప్పుకున్నాడు.