July 14, 2026

Tamannaah Bhatia: అందానికే అసూయ పుట్టిస్తున్న మిల్కీ బ్యూటీ .. పింక్ లెహంగాలో తమన్నా మెరుపులు!

Tamannaah Bhatia: అందానికే అసూయ పుట్టిస్తున్న మిల్కీ బ్యూటీ .. పింక్ లెహంగాలో తమన్నా మెరుపులు!
Reading Time: < 1 minute

Tamannaah Bhatia: అందానికే అసూయ పుట్టిస్తున్న మిల్కీ బ్యూటీ .. పింక్ లెహంగాలో తమన్నా మెరుపులు!

Caption of Image.

 అందం, అభినయంతో రెండు దశాబ్ధాలుగా టాలీవుడ్ ప్రేక్షకులను అలరిస్తూనే ఉంది మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా. కేవలం వెండి తెరపైన మాత్రమే కాకుండా ఫ్యాషన్ ప్రపంచంలోనూ తనదైన ముద్ర వేస్తోంది. తాజాగా లక్మే ఫ్యాషన్ వీక్ వేదికగా ఈ బ్యూటీ ధరించిన పింక్ డిజైనర్ దుస్తులు ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారాయి. ఈ ఫొటోలోని మెరుపులు నె టిజన్లను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి.

 ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ భూమిక శర్మ రూ పొందించిన ఆఫ్టర్ గ్లో కలెక్షన్ లో భాగంగా ఈ పింక్ కలర్ మోడ్రన్ లెహంగాలో తమన్నా మెరిసింది. పింక్ లెహంగాపై చేసిన సునిశితమైన ఎంబ్రాయిడరీ వర్క్. . జతగా ఎంపిక చేసుకున్న మోడ్రన్ బ్లౌజ్ ఆమె అందాన్ని రెట్టింపు చేశాయి. ఆధునికత, సంప్రదాయం కలగలిసిన ఈ లెహంగాలో ఎంతో హుందాగా కనిపిస్తోంది. ప్రస్తుతం ఈ ఫోటోలు తెగ వైరల్ అవుతున్నాయి.

ఇక సినిమాల విషయాని కొస్తే.. వయసు పెరుగుతున్నా.. తన గ్లామర్ మాత్రం ఏ మాత్రం తగ్గలేదు. గత 20 ఏళ్లుగా తెలుగు, తమిళం, హిందీ చిత్రాల్లో అలరిస్తుంది.  ప్రస్తుతం ఈ బ్యూటీ.. పురుషన్, ఓ రోమియో, రేంజర్ చిత్రాల్లో నటిస్తోంది. వివాన్- ఫోర్స్ ఆఫ్ ది పారెస్ట్ షూటింగ్ దశలో ఉంది. నెట్ ఫ్లెక్స్, హాట్ స్టార్ వంటి ప్రముఖ ఓటీటీ సంస్థల కోసం కొన్ని వెబ్ ఒరిజినల్స్ లో నటించనున్నట్లు సమాచారం.

 

©️ VIL Media Pvt Ltd.