Reading Time: < 1 minute

షాద్‌నగర్‌లో ఒక్క బంక్‌లోనే దొరుకుతున్న.. పెట్రోల్, డీజిల్.. క్యూ కట్టిన జనం

Caption of Image.

షాద్‌నగర్‌: పశ్చిమాసియా ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితుల ప్రభావంతో రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్‌ పట్టణంలో ఇంధన కొరత తీవ్రంగా కనిపిస్తోంది. పట్టణంలో ఉన్న పలువురు పెట్రోల్ బంకులు మూతపడగా, కేవలం కొత్తపేట రోడ్డులోని ఒక్క బంక్‌లో మాత్రమే పెట్రోల్, డీజిల్ లభిస్తున్నాయి. దీంతో వాహనదారులు భారీగా అక్కడికి చేరుకొని బారులు తీరుతున్నారు.

ద్విచక్రవాహనాలు, కార్లు, ఆటోలు, ట్రాక్టర్లు, లారీలు సహా అన్ని వాహనదారులు ఇంధనం కోసం ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా రైతులు పంటలకు నీరు అందించేందుకు అవసరమైన డీజిల్ దొరకక ఆందోళన చెందుతున్నారు. పట్టణంలో చాలా వరకు మూతపడటంతో పరిస్థితి మరింత క్లిష్టంగా మారింది.

ఇంధన కొరతతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటూ, సాధారణ జీవనం కూడా ప్రభావితమవుతోంది. అధికారులు వెంటనే స్పందించి సరఫరా పునరుద్ధరించాలని ప్రజలు కోరుతున్నారు. యుద్దం ప్రభావంతో కరీంనగర్​ జిల్లాలో కూడా పెట్రోల్, డీజిల్, గ్యాస్  కొరత స్పష్టంగా కనిపించింది. 

పెట్రోల్, డీజిల్ సరఫరా తగ్గడంతో కరీంనగర్ పట్టణంలోని పద్మనగర్​పెట్రోల్​బంక్​ నాలుగు రోజులుగా మూసేశారు. ఈ ప్రాంతంలోని వాహనదారులు బంక్​కు వచ్చి వెనుదిరుగుతున్నారు. ఇలా జిల్లాలోని పలు చోట్ల బంక్లు మూతపడ్డాయి.

©️ VIL Media Pvt Ltd.