Reading Time: < 1 minute
Iran Internet Shutdown 24 Days War Impact Citizens Struggle

గత నెల 28న ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్తంగా దాడి చేశాయి. ఈ ఘటనలో ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ హతమయ్యాడు. అనంతరం ఇరాన్‌కు చెందిన అత్యున్నత నాయకులంతా చనిపోయారు. అయితే యుద్ధం ప్రారంభం కాగానే ఇరాన్‌లో ఇంటర్నెట్ సౌకర్యం నిలిచిపోయింది. దాదాపుగా ఇప్పటి వరకు 24 రోజులైంది. అప్పటి నుంచి ఇంటర్నెట్ పునరుద్ధరణ కాలేదు. దీంతో ఇరానీయులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అన్ని ముఖ్యమైన పనులు నిలిచిపోయాయి. ఇక ప్రపంచంలో ఏం జరుగుతుందో అర్థం కాని పరిస్థితి నెలకొన్నాయి. యూట్యూబ్‌ సహా సోషల్ మీడియాలు పని చేయడం లేదు. దీంతో అన్ని అత్యవసర పనులు కూడా స్తంభించిపోయాయి. దీంతో ఇరానీయులు నానా ఇబ్బందులు పడుతున్నారు.

ఇది కూడా చదవండి: UP: ఇద్దరు భార్యలతో 18 మంది సంతానం.. చివరికి ప్రియురాలి చేతిలో..!

గత నెల 28న ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్తంగా దాడి చేశాయి. ఈ ఘటనలో ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ సహా అత్యున్నత నాయకులు చనిపోయారు. దీంతో ప్రతీకారంగా గల్ఫ్ దేశాలపై ఇరాన్ క్షిపణులతో విరుచుకుపడింది. దీంతో పెద్ద ఎత్తున చమురు, గ్యాస్ సంక్షోభం తలెత్తింది. అన్ని దేశాల్లో గ్యాస్ కొరతతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. అయితే యుద్ధం ఎప్పుడు ముగుస్తుందో అర్థం కాని పరిస్థితి నెలకొంది.

ఇది కూడా చదవండి: PM Modi: చమురు, గ్యాస్‌పై ఆందోళన అక్కర్లేదు.. భారతీయులంతా సురక్షితమేనన్న మోడీ