Reading Time: < 1 minute

జన్నారం కవ్వాల్ టైగర్ రిజర్వ్‎లో కార్చిచ్చు

Caption of Image.

మంచిర్యాల జిల్లా జన్నారం కవ్వాల్ టైగర్ రిజర్వ్‎లో మంగళవారం (మార్చి 17) రాత్రి కార్చిచ్చు రాజుకుంది. జింకల పార్క్ సమీపంలోని అడవుల్లో మంటలు ఎగిసిపడుతున్నాయి. గమనించిన స్థానికులు అటవీ అధికారులకు సమాచారం అందించారు. వెంటనే అప్రమత్తమైన ఫారెస్ట్ ఆఫీసర్స్ అగ్నిమాపక సిబ్బంది ఇన్ఫర్మేషన్ ఇచ్చారు.

 హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకున్న అధికారులు సహయక చర్యలు చేపట్టారు. మంటలను అదుపులోకి తీసుకొచ్చేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు. భారీ కార్చిచ్చుతో సమీప గ్రామ ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. సాధ్యమైనంత త్వరగా మంటలను అదుపులోకి తీసుకురావాలని అధికారులను కోరారు.

►ALSO READ | సినీ నటి రేణు దేశాయ్‎ సోషల్ మీడియా వేధింపుల కేసులో ఇద్దరు అరెస్ట్

కార్చిచ్చుతో వన్యప్రాణులకు ముప్పు ఏర్పడుతుందని జంతుప్రేమికుల అందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాదశాత్తూ జరిగిందా లేక మానవ ప్రమేయం ఏమైనా ఉందా అన్న కోణంలో ఆరా తీస్తున్నారు.  

 

©️ VIL Media Pvt Ltd.