Reading Time: < 1 minute
Today Stock Market Down Effect In Middle East War

మధ్యప్రాచ్య యుద్ధంతో దేశీయ స్టాక్ మార్కెట్ కుదేల్ అయిపోతుంది. ఈ వారం మార్కెట్ ప్రారంభం నుంచి భారీ నష్టాలను ఎదుర్కొంటోంది. ఇప్పటికే లక్షల కోట్ల సంపద ఆవిరైపోయింది. ఇప్పట్లో యుద్ధం కూడా ఆగే పరిస్థితులు కనిపించడం లేదు. తాజాగా యుద్ధం మరింత తీవ్రత పెరిగింది. దీంతో మార్కెట్ వాతావరణం ఇలానే ఉంటుందని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు.

ఇది కూడా చదవండి: Modi-Trump: యుద్ధం వేళ భారత్‌కు గుడ్‌న్యూస్.. రష్యా చమురు కొనుగోలుకు అమెరికా అనుమతి

ప్రస్తుతం సెన్సెక్స్ 452 పాయింట్లు నష్టపోయి 79, 563 దగ్గర కొనసాగుతుండగా.. నిఫ్టీ 130 పాయింట్లు నష్టపోయి 24, 635 దగ్గర కొనసాగుతోంది. నిఫ్టీలో భారత్ ఎలక్ట్రానిక్స్, రిలయన్స్ ఇండస్ట్రీస్, హెచ్‌సీఎల్ టెక్నాలజీస్, ఎన్‌టీపీసీ, విప్రో ప్రధాన లాభాలను ఆర్జించగా… ఇంటర్‌గ్లోబ్ ఏవియేషన్, ఐసీఐసీఐ బ్యాంక్, ఐషర్ మోటార్స్, మాక్స్ హెల్త్‌కేర్, ఎల్ అండ్ టీ నష్టపోయాయి.

ఇది కూడా చదవండి: Iran-Gulf War: గల్ఫ్‌లో ఉద్రిక్తతలు.. ఆయిల్ రిఫైనరీలే లక్ష్యంగా ఇరాన్ భీకర దాడులు

ఇక మధ్యప్రాచ్యంలో జరుగుతున్న ఘర్షణల కారణంగా గ్లోబల్ ఎనర్జీ సరఫరాపై ప్రభావం పడే అవకాశం ఉందని భయాలు పెరుగుతున్నాయి. దీంతో క్రూడ్ ఆయిల్ ధరలు పెరిగే అవకాశముండడంతో ద్రవ్యోల్బణం మళ్లీ పెరగవచ్చనే ఆందోళనలు పెట్టుబడిదారుల్లో ఉన్నాయి. ఈ నేపథ్యంలో మార్కెట్లు మరికొద్ది రోజులు ఇలానే ఉండొచ్చు.