Reading Time: < 1 minute

బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బి.రామచంద్రరావు,కామారెడ్డి ఎమ్మెల్యే కాటేపల్లి వెంకటరమణారెడ్డి అరెస్టులను నిరసిస్తూ మానకొండూర్ లో బిజెపి మండల అధ్యక్షుడు కంది రాజిరెడ్డి ఆధ్వర్యంలో నాయకులు,కార్యకర్తలు సోమవారం రాస్తారోకో నిర్వహించారు.అరెస్టులను నిరసిస్తూ కరీంనగర్,వరంగల్ రహదారిపై బైఠాయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.మానకొండూర్ సిఐ సంజీవ్,పోలీస్ సిబ్బంది రాస్తారోకో చేస్తున్న పల్లె చౌరస్తాకు చేరుకుని బిజెపి నాయకులతో మాట్లాడి రాస్తారోకో విరమింపజేశారు.ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు మీస రమణయ్య, సొన్నాకుల శ్రీనివాస్, శీలం కుమార్ యాదవ్, మిరాల హరీష్ యాదవ్, మార్కొండ రమేష్, బలరాం, తిరుపతి, శ్రీనివాస్, అశ్విన్, రాజు, రాజయ్య, చందు, వివిధ గ్రామాల కార్యకర్తలు పాల్గొన్నారు.