Reading Time: < 1 minute

వాటర్బోర్డు అధికారుల బస్తీ బాట

Caption of Image.

హైదరాబాద్​సిటీ, వెలుగు: వాటర్ ​బోర్డు పరిధి కోర్‌‌ అర్బన్‌‌ రీజయన్‌‌ వరకు పెరగడంతో వాటర్‌‌, సీవరేజ్‌‌ సేవలు మరింత సమర్ధవంతంగా అందించేందుకు, స్థానిక సమస్యలు పరిష్కరించేందుకు ‘వాటర్​బోర్డు బస్తీ బాట’ పేరిట ప్రత్యేక కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. దీనికి సంబంధించి బోర్డు ఎండీ అశోక్​రెడ్డి గురువారం సర్క్యులర్​జారీ చేశారు. 

శుక్రవారం ఈ కార్యక్రమాన్ని ప్రారంభించి ప్రతి మంగళ, బుధ, శుక్ర, శనివారాల్లో ఉదయం 7 గంటల నుంచి 10 గంటల వరకు బస్తీల్లో పర్యటిస్తారు. ఇందులో ఎండీ నుంచి మొదకుంటే వార్డు మేనేజర్ల వరకు పాల్గొంటారు. బస్తీ పర్యటన తీరును పరిశీలించేందుకు ఉన్నతాధికారులు తనిఖీలు నిర్వహించనున్నారు. ప్రతి వారం పర్యటనపై శనివారం ఎండీ తన ఆఫీసులో సమీక్షా నిర్వహిస్తారు.

©️ VIL Media Pvt Ltd.