
రీల్స్ పిచ్చి రోజు రోజుకు శృతి మించుతుంది. ఏం చేస్తున్నామో.. ఎలాంటి పనులు చేయిస్తున్నామో సోయి లేకుండా పోతుంది జనానికి.. మినిమం కామన్ సెన్స్ అనేది మిస్ అవుతున్నారు.. రీల్స్ కోసం ఓ యువకుడు.. చిన్న పిల్లోడితో సిగరెట్ తాగించటం.. మందు కొట్టిస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. లైక్స్ కోసం చేసిన ఈ పని.. ఇప్పుడు ఇంటర్నెట్ నుంచి తీవ్ర విమర్శలు ఎదుర్కొంటోంది.. అంతేనా.. వీడిని వెంటనే అరెస్ట్ చేయాలి.. ఆ వీడియోలను డిలీట్ చేయాలంటూ నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు. ఈ రీల్స్ వీడియో పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
సోషల్ మీడియాలో వైరల్ అవుతోన్న వీడియో రాజస్థాన్‌లో జరిగినట్లు తెలుస్తోంది. ఈ వీడియో ప్రకారం.. బైక్‌పై కూర్చొన్న ఓ యువకుడు పక్కనే ఉన్న చిన్న పిల్లాడికి బీర్ టిన్ తాగమని అందించాడు. ఆ పిల్లాడు అది ఏంటో తెలియక తాగేశాడు. అక్కడితో ఆగకుండా యువకుడు తాను తాగిన సిగరెట్‌ను ఆ బాలుడికి ఇచ్చాడు. బాలుడు ఆ సిగరెట్ తాగడానికి ప్రయత్నించాడు. సిగరెట్ ఘాటుకు ఆ చిన్న పిల్లాడు దగ్గటం వీడియోలో కనిపిస్తుంది. ఈ ఘటన ఎప్పుడూ, ఎక్కడ జరిగిందో స్పష్టంగా వివరాలు తెలియదు. కానీ వీడియో సోషల్ మీడియాలో తెగా వైరల్‌గా మారింది.
ఈ వీడియో చూసిన నెటిజన్లు బాలుడికి బీర్ టిన్, సిగరెట్ ఇచ్చిన యువకుడిపై మండిపడుతున్నారు. మద్యం, సిగరెట్ అంటే ఏంటో కూడా తెలియని ఆ చిన్న పిల్లాడి చేత మందు, సిగరెట్ తాగిపిస్తున్న ఆ యువకుడిని అరెస్ట్ చేసి కఠిన చర్యలు తీసుకోవాలని నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు. ఈ వీడియోను పోలీసులకు ట్యాగ్ షేస్తూ రీల్స్, లైక్‌ల పిచ్చిలో బాలుడిని తప్పుదోవ పట్టిస్తోన్న యువడికిపై సీరియస్ యాక్షన్ తీసుకోవాలంటున్నారు.
వినోదం, సోషల్ మీడియా కంటెంట్ కోసం పిల్లలతో ఆటలేంట్రా అంటూ మరికొందరు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇది కచ్చితంగా రీల్స్ కోసం రికార్డ్ చేసిన వీడియోనేనని.. బాలుడికి మందు, సిగరెట్ ఇచ్చిన యువకుడితో పాటు ఆ వీడియో రికార్డ్ చేసిన వాడిపైన చర్యలు తీసుకోవాలని కోరాడు మరో యూజర్. బొక్కలో వేసి నాలుగు ఉతుకులు ఉతికితే రీల్స్ పిచ్చి వదిలాలి అంటూ ఇంకొందరు కామెంట్స్ చేశారు.
This is unacceptable.
> A man is seen allegedly giving beer and a cigarette to a small child.
> Bike number visible: RJ25 SS 8392
> If the number plate is clear, identifying the person should not be difficult.
> Providing alcohol and tobacco to a minor is a punishable offence.… pic.twitter.com/JSLArKrIU8— Divya Gandotra Tandon (@divya_gandotra) February 18, 2026