Reading Time: < 1 minute

ఇంత కంటే అవమానం ఉండదు: పసికూన ముందు పరుపు పొగొట్టుకున్న పాకిస్తాన్, ఆస్ట్రేలియా..!

Caption of Image.

ఐసీసీ టీ20 వరల్డ్ కప్ 2026లో ఇటలీ పోరాటం ముగిసింది. ఈ పసికూన జట్టు గ్రూప్ దశలోనే నిష్క్రమించింది. తొలిసారి మెగా టోర్నీ ఆడిన ఇటలీ అంచనాలకు మించి రాణించింది. ఫస్ట్ టైమ్ వరల్డ్ కప్ ఆడుతున్నామనే టెన్షన్ లేకుండా బలమైన జట్లపై మెరుగైన ప్రదర్శనతో ఆకట్టుకుంది. అంతేకాకుండా ఒక విషయంలో ఇటలీ మాజీ చాంపియన్లు పాకిస్తాన్, ఆస్ట్రేలియా కంటే మెరుగ్గా ఉంది. 

అదే గ్రూప్ దశలో అత్యధిక సిక్సర్లు కొట్టడం. గ్రూప్ దశలో భాగంగా నాలుగు మ్యాచులు ఆడిన ఇటలీ మొత్తం 34 సిక్సర్లు కొట్టింది. గ్రూప్ దశలో అత్యధిక సిక్సర్లు బాదిన జాబితాలో ఇటాలియన్ టీమ్ నాలుగో స్థానంలో నిలిచింది. ఇదే సమయంలో పాకిస్థాన్ 28, ఆస్ట్రేలియా 14 సిక్సర్లతో ఇటలీ కంటే వెనుకంజలో ఉండటం గమనార్హం.

ఈ జాబితాలో 40 సిక్సర్లతో టీమిండియా అగ్రస్థానంలో నిలిచింది. 33 సిక్సర్లతో మరో పసికూన అమెరికా ఈ జాబితాలో నాలుగో  స్థానంలో నిలవడం విశేషం. మాజీ ప్రపంచ విజేతలైనా ఆస్ట్రేలియా, పాకిస్తాన్ పసికూనలు ఇటలీ, అమెరికా కంటే తక్కువ సిక్సర్లు కొట్టడంపై క్రికెట్ ఫ్యాన్స్ సెటైర్లు వేస్తున్నారు. 

ఇంత కంటే అవమానం మరొకటి ఉండదని.. పసికూనలు ముందు పాకిస్తాన్, ఆస్ట్రేలియా పరువు పొగొట్టుకున్నాయని కామెంట్స్ చేస్తున్నారు. చెత్త ప్రదర్శనతో మాజీ చాంపియన్ ఆస్ట్రేలియా ఈ వరల్డ్ కప్‎లో గ్రూప్ దశనలోనే నిష్క్రమించిన విషయం తెలిసిందే. 

ఐసీసీ 2026 టీ20 వరల్డ్ కప్ గ్రూప్ దశలో ఎక్కువ సిక్సులు కొట్టిన జట్లు:

భారతదేశం – 40 సిక్సులు
ఇంగ్లాండ్ – 36 సిక్సులు
వెస్టిండీస్ – 36 సిక్సులు
ఇటలీ – 34 సిక్సులు
యూఎస్ఏ – 33 సిక్సులు

©️ VIL Media Pvt Ltd.