Reading Time: < 1 minute

రాజన్న సిరిసిల్ల జిల్లాలో పులి సంచారం

Caption of Image.

రాజన్న సిరిసిల్ల జిల్లాలో తంగళపల్లి మండలంలో పులి సంచారం కలకలం రేపుతోంది. తంగళపల్లి శివారు ప్రాంతాల్లో పులి సంచరిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. దీంతో  తంగళపల్లి, దాని చుట్టు పక్కల గ్రామాల ప్రజలు  భయాందోళనకు గురవుతున్నారు. 

శుక్రవారం (ఫిబ్రవరి19) తంగళపల్లి గ్రామ శివారులోని గుట్టలో పులి పాదముద్రలు గుర్తించారు అటవీ శాఖ అధికారులు.  జాగ్రత్తగా ఉండాలని ప్రజలను అలెర్ట్ చేశారు. తంగళపల్లి తోపాటు సమీప గ్రామాలు గోపాలరావు పల్లె, తాడూరు, చింతల్ టాన ప్రజలను అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. బావులు, పొలాల దగ్గర వెళ్లే రైతులు మరింత అప్రమత్తంగా ఉండాలని సూచించారు.  

©️ VIL Media Pvt Ltd.