Reading Time: < 1 minute

లవర్ దూరం పెడుతోందని… ఇంట్లో దూరి సుత్తెతో తల పగలకొట్టిన యువకుడు..

Caption of Image.

ఈ జనరేషన్ యూత్ మెంటాలిటీ అంచనా వేయడం చాలా కష్టం. కొంతమంది చిన్న చిన్న సమస్యలకే తట్టుకోలేక ప్రాణాలు తీసుకుంటుంటే.. మరికొంతమంది ఎదుటివారి ప్రాణాలు తీసేందుకు ఏమాత్రం వెనకాడటంలేదు. కొంతమంది లవ్ లో ఫెయిల్ అయ్యి ఆత్మహత్యలకు పాల్పడుతుంటే..మరికొంతమంది తమ ప్రేమను ఒప్పుకోలేదని అవతలివారిని చంపడానికి కూడా సిద్దపడుతున్నారు. సౌర్యాపేట జిల్లాలో ఇలాంటి ఘటనే జరిగింది. ప్రేమించిన అమ్మాయి దూరం పెడుతోందని.. ఇంట్లో దూరి సుత్తెతో తల పగలగొట్టాడు ఓ యువకుడు. ఈ ఘటనకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి.. 

సూర్యాపేటలోని స్నేహ నగర్ లో దారుణం జరిగింది. ప్రేమించిన అమ్మాయి దూరం పెడుతోందని ఇంట్లో దూరి సుత్తెతో తలపై దాడి చేశాడు ఓ యువకుడు. స్నేహ నగర్ కు చెందిన స్పందన మహేష్ అనే యువకుడితో ప్రేమలో ఉంది. ఏ కారణం చేతనో గత కొంతకాలంగా మహేష్ ను దూరం పెడుతూ వస్తోంది. ఈ క్రమంలో స్పందనపై కోపం పెంచుకున్నాడు మహేష్.

ఎవరూ లేని సమయంలో ఇంట్లో దూరిన మహేష్ సుత్తెతో స్పందన తలపై విచక్షణ రహితంగా దాడి చేశాడు. ఈ ఘటనలో స్పందన తీవ్రంగా గాయపడింది. విషయం తెలుసుకున్న స్థానికులు నిందితుడు మహేష్ ని పట్టుకొని స్తంభానికి కట్టేసి దేహశుద్ది చేశారు. తీవ్రంగా గాయపడ్డ స్పందనను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. 

©️ VIL Media Pvt Ltd.