Reading Time: < 1 minute

Galgotias University apologises : రోబోపై మావాళ్లకు అవగాహన లేదు.. సారీ చెప్పిన గాల్గోటీస్ యూనివర్సిటీ.

Caption of Image.

ఢిల్లీ AI సమ్మిట్‌లో చైనా రోబోటిక్ కుక్క ప్రదర్శన వివాదంపై ఎట్టకేలకు గాల్గోటీస్ యూనివర్సిటీ సారీ చెప్పింది.తన రిప్రజెంటేటివ్ తప్పుడు సమాచారం ఇచ్చారని వివరణ ఇచ్చింది. రోబోటిక్ డాగ్ పై ఆమెకు ఎలాంటి అవగాహన లేదు.. ఆమె మీడియా ముందుకు రావాలనే ఉత్సాహంతో తప్పుడు సమాచారం ఇచ్చింది వాస్తవానికి మీడియాతో మాట్లాడే  అధికార ప్రతినిధి కాదు అంటూ సర్ది చెప్పుకుంది యూనివర్సిటీయాజమాన్యం. 

ఢిల్లీలో జరుగుతున్న AI సమ్మిట్ లో ప్రదర్శించిన మంగళవారం గాల్గోటియాస్ యూనివర్సిటీ ప్రదర్శించిన రోబోటిక్ కుక్క వివాదాస్పదమైంది. ఈ రోబోటిక్ కుక్కను గల్గోటియాస్ లోని సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్  అభివృద్ది చేసిందని యూనివర్సిటీ ప్రొఫెసర్ చెప్పడంతో వివాదం చెలరేగింది. ఈ రోబోటిక్ డాగ్ వాస్తవానికి యూనిట్రీ 2 అని చైనాకు చెందిన యూనిట్రీ రోబోటిక్స్ కంపెనీ తయారు చేసింది.. విద్యా, పరిశోధనల్లో  ప్రపంచవ్యాప్తంగా ప్రదర్శించబడింని హైలైట్ చేశారు. 

ఇక ఈ ఎపిసోడ్ వివాదంగా మారడంతో యూనివర్సిటీ స్టాల్ ఖాళీ చేయాలని  ఆదేశించారు. తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్న గల్గోటియాస్ యూనివర్సిటీ.. రోబోట్ ను తాము సృష్టించింది కాదని.. సంస్థ ఎప్పుడు అలా చెప్పుకోలేదని వివరణ ఇచ్చింది. ఇప్పటికైనా ఈ వివాదం సద్దు మణుగుతుందో చూడాలి.

©️ VIL Media Pvt Ltd.