Reading Time: < 1 minute

T20 World Cup: టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న ఇంగ్లాండ్.. 

Caption of Image.

T20 World Cup: టీ20 ప్రపంచకప్ గ్రూప్-సీ మ్యాచ్‌లో భాగంగా కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా ఇంగ్లాండ్ వర్సెస్ స్కాట్లాండ్ మ్యాచ్ జరుగుతుంది. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన ఇంగ్లాండ్ బౌలింగ్ తీసుకోవడంతో స్కాట్లాండ్ మొదట బ్యాటింగ్ చేయనుంది. నేపాల్‌పై కష్టపడి గెలిచి, వెస్టిండీస్ చేతిలో ఓడిన ఇంగ్లాండ్ ప్రస్తుతం ఈ గ్రూప్‌–సీలో నాలుగో స్థానంలో కొనసాగుతుంది. ఈ స్థితిలో స్కాట్లాండ్ చేతిలో ఓటమి ఎదురైతే, ఇంగ్లాండ్ ప్రతిష్ఠతో పాటు సూపర్-8 దశకు చేరుకునే అవకాశాలు పోతాయి.  

భారత పరిస్థితులు బాగా తెలిసిన ఇంగ్లాండ్ తమ బలమైన బ్యాటింగ్‌పై భారీ ఆశలు పెట్టుకుంది. ఫిల్ సాల్ట్, జోస్ బట్లర్, హ్యారీ బ్రుక్, సామ్ కరన్, జాకబ్ బెథెల్, విల్ జాక్స్ వంటి ఆటగాళ్లు ప్రత్యర్థి బౌలర్లకు కఠిన సవాల్ విసరగలరు. బౌలింగ్ విభాగంలో జోఫ్రా ఆర్చర్, జేమీ ఓవర్టన్ పేస్‌తో పాటు ఆదిల్ రషీద్, లియామ్ డాసన్ స్పిన్‌తో జట్టుకు అదనపు బలం చేకూరుస్తున్నారు.

మరోవైపు, చివరి నిమిషంలో టోర్నీలోకి ప్రవేశించిన స్కాట్లాండ్ ఎలాంటి ఒత్తిడి లేకుండా ఆడుతుంది. రిచీ బెర్రింగ్టన్ కెప్టెన్సీలో జట్టు ప్రత్యేర్థి జట్టు అంచనాలను తలకిందులు చేసే సత్తాను కలిగి ఉంది. ఇంగ్లాండ్‌కు ఈ మ్యాచ్ తప్పకుండా గెలవాల్సిన పరిస్థితిలో ఉంది. అలాగే, స్కాట్లాండ్‌ కూడా తమను తాము నిరూపించుకునే సువర్ణావకాశం ఇది.  

©️ VIL Media Pvt Ltd.