Reading Time: 2 minutes

Budget2026 Live Updates: కేంద్ర బడ్జెట్ 2026.. బడ్జెట్ ప్రవేశపెట్టిన నిర్మలా సీతారామన్

Caption of Image.
  • మూడు కర్తవ్యాలను ప్రకటించిన ఆర్థిక మంత్రి
  • 1.సమ్మిళిత ఆర్థిక వృద్ధి
  • 2.వృద్ధిలో ప్రజలందరి భాగస్వామ్యం
  • 3. సబ్ కా సాత్.. సబ్ కా వికాస్
Image
  • 7 శాతం వృద్ధి రేటుతో ముందుకు సాగుతున్నాం
  • గ్లోబల్ మార్కెట్లతో పోటీ పడుతూ ముందుకు సాగుతున్నాం
  • ​​​​​వికసిత్ భారత్ దిశగా అడుగులు వేస్తున్నాం
  • Image
  • ఎగుమతులపై ఆధారపడటం తగ్గించుకుని సంస్కరణలను కొనసాగిస్తున్నాం
  • అనిశ్చిత పరిస్థితుల్లోనూ సాఫీగా ముందుకెళుతున్నాం
  • భారత్ ఆర్థిక ప్రయాణం స్థిరంగా కొనసాగుతోంది
  • 2026-27 బడ్జెట్ ను యువశక్తి బడ్జెట్ గా అభివర్ణించిన నిర్మలా సీతారామన్
  • లోక్ సభలో మొదలైన నిర్మలమ్మ బడ్జెట్ ప్రసంగం
  • బడ్జెట్ 2026-27: పార్లమెంట్ చేరుకున్న ప్రధాని నరేంద్ర మోదీ
  • ముగిసిన కేంద్ర కేబినెట్ సమావేశం.. బడ్జెట్కు కేంద్ర కేబినెట్ ఆమోదం
  • బడ్జెట్లోని కీలక అంశాలను రాష్ట్రపతికి వివరించిన కేంద్ర ఆర్థిక మంత్రి
  • బడ్జెట్ ప్రతులను రాష్ట్రపతికి అందజేసిన నిర్మల
  • నిర్మలకు స్వీటు తినిపించిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
Image
  • రాష్ట్రపతిని కలిసిన అనంతరం పార్లమెంట్ చేరుకున్న ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్
  • ఆదివారం 9వ సారి బడ్జెట్ స్పీచ్ ఇవ్వనున్న నిర్మలా సీతారామన్
  • ఫిబ్రవరి 2024లో మధ్యంతర బడ్జెట్తో సహా ఇప్పటివరకూ వరుసగా 8 సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టిన నిర్మలమ్మ
  • 2019లో మొదటిసారి కేంద్ర బడ్జెట్ను ప్రవేశపెట్టిన నిర్మలా సీతారామన్ 
  • ప్రధాన మంత్రిగా నరేంద్ర మోదీ రెండో సారి అధికారంలోకి వచ్చాక 2019లో ఆర్థిక మంత్రిగా నిర్మల బాధ్యతలు
  • ఉదయం 11 గంటలకు ప్రారంభమయ్యే బడ్జెట్ ప్రసంగం దాదాపు గంట, గంటన్నర సేపు ఉండే అవకాశం
  • దేశ చరిత్రలోనే తొలిసారిగా ఆదివారం రోజున బడ్జెట్ ప్రవేశపెట్టడం ద్వారా కొత్త ఒరవడికి నిర్మల శ్రీకారం
  • వరుసగా 9 సార్లు కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టిన ఏకైక మహిళా ఆర్థిక మంత్రిగా నిర్మలా సీతారామన్కు దక్కనున్న రికార్డు
  • 8 సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టిన ఆర్థిక మంత్రులుగా మూడో స్థానంలో ప్రణబ్ ముఖర్జీ, ప్రస్తుత ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్
  • మొరార్జీ దేశాయ్ తర్వాత అత్యధికంగా 9 సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టిన ఆర్థిక మంత్రిగా రెండో స్థానంలో పి. చిదంబరం
  • కేంద్ర బడ్జెట్ను అత్యధికంగా 10 సార్లు ప్రవేశపెట్టిన ఆర్థిక మంత్రిగా మాజీ ప్రధాని మొరార్జీ దేశాయ్ రికార్డ్
  • పార్లమెంట్లో ఆదివారం ఉదయం 11 గంటలకు కేంద్ర బడ్జెట్ 2026–27
©️ VIL Media Pvt Ltd.