Reading Time: < 1 minute
Kethireddy Venkatarami Reddy: వైసీపీ నేతలు కేసులకు భయపడే రోజులు పోయాయి

వైసీపీ మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి ఇటీవల జైలు నుండి బెయిల్ పై విడుదలైన జోగి రమేష్‌ను పరామర్శించారు. నకిలీ మద్యం విషయాన్ని ఎత్తి చూపడం వల్లే జోగి రమేష్‌ని తప్పుడు కేసులో జైలుకు పంపించారని కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి ఆరోపించారు. వైసీపీ నేతలు ఎలాంటి కేసులకు భయపడరని, రెట్టింపు ఉత్సాహంతో ప్రభుత్వంపై పోరాడతామని ఆయన స్పష్టం చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇలాంటి అక్రమ కేసులకు భయపడే రోజులు పోయాయని కేతిరెడ్డి పేర్కొన్నారు. “మీరు జైల్లో ఎంతమందిని వేస్తారో అంతకు పదింతలుగా మీరు చేసే తప్పిదాలను ప్రశ్నిస్తాం, ఎదిరిస్తాము, మాట్లాడతాం. అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ” అని ఆయన అన్నారు. తమ పార్టీ పుట్టినప్పటి నుంచి, అధినాయకుడు వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డితో సహా పలువురు జైలుకు వెళ్లిన చరిత్రను గుర్తుచేశారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Gold and Silver: జెట్ స్పీడుతో దూసుకుపోతున్న బంగారం, వెండి ధరలు

అమరావతి రైతులకు ‘ప్లాట్’ పండుగ.. ఉండవల్లి రైతులకు ఎట్టకేలకు మోక్షం

లిఫ్ట్ ఓపెన్.. మంగళసూత్రం ఖతం !! ఆమెతోనే కలిసి వచ్చి..మాయమైన కిలాడీ దొంగ

విదేశీ బ్రాండ్లు ఇక మన లోకల్ మార్కెట్ ధరలకే

Kethireddy Venkatarami Reddy: ఎన్ని కేసులు పెడితే అంత ఉత్సాహంతో పోరాటం చేస్తాం