Reading Time: < 1 minute
పద్మ పురస్కారాలను ప్రకటించిన కేంద్రం.. 45మందికి పద్మశ్రీ.. తెలంగాణ నుంచి ఇద్దరికి అవార్డు..

గణతంత్ర దినోత్సవం సందర్భంగా కేంద్ర ప్రభుత్వం పద్మ పురస్కారాలను ప్రకటించింది. వివిధ రంగాల్లో విశేష సేవలు అందించిన 45 మంది ప్రముఖులకు పద్మశ్రీ అవార్డులు ప్రకటించింది. సైన్స్, వ్యవసాయం, కళలు, సామాజిక సేవా రంగాల్లో విశేష కృషి చేసిన వ్యక్తులకు ఈ జాబితాలో పెద్దపీట వేశారు. ఈ జాబితాలో తెలంగాణకు చెందిన ఇద్దరు దిగ్గజాలు చోటు సంపాదించుకోవడం విశేషం. సీసీఎంబీ శాస్త్రవేత్త డాక్టర్‌ కుమారస్వామి తంగరాజ్‌ సైన్స్ రంగంలో, నిజామాబాద్‌కు చెందిన మామిడి రామరెడ్డి పశుసంవర్ధక రంగంలో తమ సేవలకు గానూ ఈ గౌరవాన్ని అందుకున్నారు.

దక్షిణ భారతదేశానికి చెందిన పలువురిని కేంద్రం గౌరవించింది. తమిళనాడుకు చెందిన నటేశన్, తిరువారూర్ భక్తవత్సలం, ఆర్. కృష్ణన్, తిరుత్తని స్వామినాథన్‌లకు పదశ్రీల పురస్కారాలకు ఎంపిక చేసింది. అదేవిధంగా కళలు, సంస్కృతికి సంబంధించిన సేవలకు గాను బుధ్రి టాటి, మేవాటి జోగి, హ్యాలీవార్, ఖేమ్ రాజ్, శ్రీరంగ్ దేవాబా, యుమ్నం జాత్రా సింగ్‌లకు పద్మశ్రీ వరించింది. ఇక వ్యవసాయం – పర్యావరణానికి సంబంధించి అంకెగౌడ, దేవకి అమ్మాజీ, ఎస్జీ సుశీలమ్మ, తాగా రామ్‌భీల్‌లను పద్మశ్రీ అవార్డులకు ఎంపిక చేసింది. సామాజిక సేవతో ఇతర విభాగాలకు సంబంధించి ఫెర్నాండేజ్, భగవాన్‌దాస్, ధిండా, బ్రిజ్‌లాల్, చిరంజీ లాల్‌యాదవ్, హ్యాజీభాయి, మోహన్‌ల సేవలను కేంద్రం గుర్తించి అవార్డులతో సత్కరించింది.

అంతేకాకుండా పద్మశ్రీ జాబితాలో చరణ్, ధార్మిక్‌లాల్, ఇందర్‌జిత్, పజనివేల్, కైలాస్ చంద్ర, మహేంద్ర కుమార్, నరేష్ చంద్రదేవ్, నిలేష్ వినోద్‌చంద్ర, నూరుద్దీన్ అహ్మద్, పద్మా గుర్మెట్, లేఖ్తేపి, రఘుపత్‌సింగ్, రఘువీర్ తుకారామ్, రాజస్తపతి, రామచంద్ర, పొంగెనర్, షఫీ షౌక్, శ్యామ్ సుందర్, సిమాంచల్ పాత్రో, సురేష్, తేచీ గుబిన్ విశ్వ బంధు వంటి ప్రముఖులు ఉన్నారు. ముఖ్యంగా జన్యు శాస్త్రవేత్తలు, సామాన్య రైతులు, జానపద కళాకారులకు ఈ జాబితాలో చోటు దక్కడం పట్ల సర్వత్రా హర్షం వ్యక్తం అవుతోంది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..