Reading Time: 2 minutes

Nidhhi Agerwal: ఇండస్ట్రీలో నన్ను తొక్కేసేందుకు భారీ కుట్ర.. నెగిటివ్ క్యాంపెయిన్‌పై నిధి అగర్వాల్ ఎమోషనల్!

Caption of Image.

వరుస సినిమా ఆఫర్స్ తో ఫుల్ జోష్ లో ఉంది టాలీవుడ్ బ్యూటీ నిధి అగర్వాల్. సినీ ఇండస్ట్రీలో తన అందం, నటనతో గుర్తింపు తెచ్చుకున్న  ఈ ముద్దుగుమ్మ.. ప్రస్తుతం తెలుగు సినీ ఇండస్ట్రీలో మోస్ట్ టాక్డ్ హీరోయిన్ గా మారింది. గతేడాది పవర్ స్టార్ పవన్ కల్యాణ్ తో ‘హరిహర వీరమ ల్లు”, ఈ సంక్రాంతికి ప్రభాస్ సరసన ‘ది రాజా సాబ్’ సినిమాలతో పుల్ క్రేజ్ ను సొంతం చేసుకుంది.

నన్ను తొక్కేసేందుకు భారీ కుట్ర

అయితే లేటెస్ట్ గా ఈ బ్యూటీ తన వ్య క్తిగత జీవితం, సినీ కెరీర్ కు సంబంధించి ఆసక్తికర విషయాలను ప్రేక్షకులతో పంచుకుంది. ఈ స్థాయికి చేరుకోవడం వెనుక ఎన్నో చేదు అనుభవాలు ఉన్నా యని గుర్తుచేసుకుంటూ ఎమోషనల్ అయ్యింది. ‘నాపై ఇండస్ట్రీలో కొందరు. పనిగట్టుకుని నెగిటివ్ క్యాంపెయిన్ చేస్తున్నారని చెప్పుకొచ్చింది.. నన్ను తొక్కేయడానికి భారీగా డబ్బులు ఖర్చు చేసి మరీ కుట్రలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేసింది.

నాలో మార్పుకు కారణం అదే!

 నటీనటులు చాలా. సెన్సిటివ్, ఎమోషనల్, చిన్నపిల్లల మనస్తత్వంతో ఉంటారని నిధి అగర్వాల్ పేర్కొంది.. ఇలాంటివి జరిగితే వారి కుటుంబాలు కూడా ఎంతో బాధపడతాయి. మేం సమాధానం చెప్పాల్సింది. మా తల్లిదండ్రులకు మాత్రమే. ఇలాంటి నెగిటివ్ క్యాంపెయిన్లు మంచిది కాదు. కాశీకి వెళ్లి వచ్చిన తర్వాత ఆధ్యాత్మికంగా నాలో చాలా మార్పు వచ్చింది. ఇప్పుడు ఇలాంటి ఎన్ని తప్పుడు ప్రచారాలు ఎదురైనా ధైర్యంగా నిలబడతా’ అంటూ చెప్పుకొచ్చింది. 

పవన్ బలమైన నాయకుడు..

ఇక ‘హరిహర వీరమల్లు’ చిత్రంలో పవన్ కళ్యాణ్ తో పనిచేసిన అనుభవాన్ని పంచుకుంది నిధి అగర్వాల్. ఆయన ఒక స్టార్ గా కాకుండా.. బలమైన నాయకత్వ లక్షణాలు ఉన్నాయని ప్రశంసించింది.  పవన్ లో కనిపించే తెగువ, ధైర్యం ఎవరిలోనూ కనిపించవని.. ఎలాంటి సమాయల్లోనై ఒంటరిగా పోరాడే శక్తి ఆయనలో ఉందని పేర్కొంది. రాజకీయాల్లో గ్రౌండ్ లెవల్ లో  పనిచేస్తూ వచ్చిన నేత.  భవిష్యత్తులో పీఎం పదవిని కూడా పవన్ కళ్యాణ్ అధిరోహించినా తనకు ఆశ్చర్యం ఉండదని ఈ బ్యూటీ వ్యాఖ్యానించింది. జనం కోసం నిలబడే నాయకుడని  పొగడ్తలతో ముంచెత్తింది నిధి. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ చేసిన ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ మారాయి.

 

©️ VIL Media Pvt Ltd.