Reading Time: < 1 minute

Bank Jobs : అప్రెంటీస్ ఖాళీలు.. తెలంగాణలోనే కొలువు

Caption of Image.

బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర 600 అప్రెంటీస్ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఆసక్తి, అర్హత గల అభ్యర్థులు ఆన్‌లైన్‌లో అప్లై చేసుకోవచ్చు. 

అప్లికేషన్ సమర్పించడానికి చివరి తేదీ జనవరి 25.

ఖాళీలు: 600. తెలంగాణ రాష్ట్రంలో 17 ఖాళీలు ఉన్నాయి. 

ఎలిజిబిలిటీ: గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం / సంస్థల నుంచి ఏదైనా విభాగంలో బ్యాచిలర్ డిగ్రీ పూర్తిచేసి ఉండాలి. అప్రెంటీస్ సంబంధిత రాష్ట్రం / కేంద్రపాలిత ప్రాంత స్థానిక భాషలో (చదవడం, రాయడం, మాట్లాడటం) ప్రావీణ్యం కలిగి ఉండాలి.

వయోపరిమితి (2025, నవంబర్ 30): 20 నుంచి 28 ఏండ్ల మధ్యలో ఉండాలి. కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం రిజర్వ్డ్ వర్గాలకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.

అప్లికేషన్: ఆన్​లైన్ ద్వారా.

అప్లికేషన్ ప్రారంభం: జనవరి 15.

అప్లికేషన్ ఫీజు: అన్ రిజర్వ్డ్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ అభ్యర్థులకు రూ.150. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు రూ.100. పీడబ్ల్యూబీడీ 
అభ్యర్థులకు ఫీజు లేదు. 

లాస్ట్ డేట్: జనవరి 25. 

సెలెక్షన్ ప్రాసెస్: షార్ట్​లిస్ట్, 12వ తరగతి/ డిప్లొమాలో సాధించిన మార్కుల ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. 
పూర్తి వివరాలకు bankofmaharashtra.in వెబ్​సైట్​ను సందర్శించండి. 

©️ VIL Media Pvt Ltd.