Reading Time: 2 minutes

ఇరాన్‌పై అమెరికా దాడి..? ఇన్ డైరెక్ట్‎గా హింట్ ఇచ్చిన ట్రంప్..!

Caption of Image.

వాషింగ్టన్: ఇరాన్‎పై అమెరికా దాడి చేయనుందా..? ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా ఖమేనీకి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున జరుగుతోన్న నిరసనల్లో అమెరికా జోక్యం చేసుకోనుందా..? ఇరాన్‎లోని నిరసనకారులకు అగ్ర రాజ్యం అండగా నిలవనుందా..? అంటే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలను భట్టి చూస్తే అవుననే సమాధానమే వినిపిస్తోంది. ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా ఖమేనీకి వ్యతిరేకంగా జరుగుతోన్న నిరసనలు తీవ్రరూపం దాల్చాయి.

 జనం పెద్దఎత్తున రోడ్లపైకి వచ్చి ఆందోళనలు వ్యక్తం చేస్తున్నారు. 15వ రోజుకు చేరుకున్న ఉద్యమాగ్ని రోజురోజుకు మరింత ఉధృతమవుతోంది. 1971 ఇరాన్ విప్లవం తర్వాత అంతటి స్థాయి ఆందోళనలతో ఆ దేశం అట్టుడుకుతోంది. ఖమేనీ నియంత పాలనకు వ్యతిరేకంగా ఇరాన్ ప్రజల్లోంచి ఆగ్రహం పెల్లుబికుతోంది. మరోవైపు నిరసనకారులను ఖమేనీ ప్రభుత్వం ఉక్కుపాదంతో ఎక్కడికక్కడ అణిచివేస్తోంది. ఇరాన్ నిరసనల్లో దాదాపు 150 మందికి పైగానే మరణించినట్లు సమాచారం.

 శాంతియుత నిరసనకారులపై ఖమేనీ ప్రభుత్వ దమనకాండను ట్రంప్ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. నిరసనకారులకు అండగా మేముంటామని ప్రకటించారు. తాజాగా ఇరాన్ అల్లర్లపై ట్రంప్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ నేతృత్వంలోని ప్రభుత్వం నుంచి గతంలో ఎన్నడూ లేని విధంగా ఇరాన్ స్వేచ్ఛ కోసం ఎదురుచూస్తోందన్నారు. శాంతియుత ప్రదర్శనకారులను రక్షించడానికి అమెరికా జోక్యం చేసుకోవచ్చని.. ఇరాన్ నిరసనకారులకు సహయం చేయడానికి యూఎస్ సిద్ధంగా ఉందని సంచలన ప్రకటన చేశారు. 

►ALSO READ | బంగ్లాదేశ్లో మరో హిందూ యువకుడి హత్య

ట్రంప్ స్టేట్మెంట్‎ కొత్త చర్చకు దారి తీసింది. సహయం చేయడానికి సిద్ధమంటూ దాడులకు రెడీ అని ట్రంప్ పరోక్షంగా సంకేతాలు ఇచ్చారంటున్నారు గ్లోబల్ పాలిటిక్స్ ఎక్స్‎పర్ట్స్. వెనిజులా మాదిరిగానే ఇరాన్‎పై అమెరికా దాడులకు ప్రణాళికలు రచిస్తోన్నట్లు తెలుస్తోంది. ట్రంప్ పరిపాలన ఇరాన్‌పై దాడి చేయడానికి ప్రాథమిక ప్రణాళికలను సిద్ధం చేస్తోందని, ఇందులో పెద్ద ఎత్తున వైమానిక దాడుల ఉంటాయని వాల్ స్ట్రీట్ జర్నల్‌ను ఉటంకిస్తూ ది న్యూయార్క్ పోస్ట్ నివేదించింది. ఇరాన్‎లోని పలు సైనిక స్థావరాలే లక్ష్యంగా దాడులకు అమెరికా రెడీ అవుతోందని తెలుస్తోంది. మరోవైపు ఖమేనీ కూడా తగ్గేదే లేదంటుండంతో ఏం అమెరికా-ఇరాన్ మధ్య ఏం జరగబోతుందని ప్రపంచదేశాల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. 

©️ VIL Media Pvt Ltd.