Reading Time: < 1 minute
రోడ్డుపైకి వేగంగా వచ్చిన నక్క .. పొంచి ఉన్న ప్రమాదం వీడియో

హిమాలయన్ రెడ్ ఫాక్స్ పాంగాంగ్ సరస్సుకు సమీపంలో సంచరిస్తున్న వీడియోను ఓ వ్యక్తి ఇన్‌స్టాలో షేర్ చేశారు. పాంగాంగ్ సరస్సుకు సమీపంలోని రోడ్డుపై ఆ నక్క కనిపించిందని, ఆ దృశ్యాన్ని ఎన్నటికీ మర్చిపోలేనని రాసుకొచ్చారు. ప్రకృతి సౌందర్యం మాటల్లో వర్ణించలేనని చెప్పుకొచ్చారు. యూజర్లు సహజంగానే ఆ వీడియోను లైకులు, కామెంట్స్‌తో వైరల్ చేశారు. ఎక్స్ వేదికగా కూడా ఈ వీడియో ట్రెండింగ్‌లోకి వచ్చేసింది. వేల కొద్దీ లైక్స్, వ్యూస్ రాబట్టింది. జనాన్ని ఎంటర్‌టైన్ చేసింది. కానీ వీడియోలోని ఓ ఆందోళనకర ట్రెండ్‌ను నెటిజన్లు గుర్తించలేకపోయారు. నక్క ప్రవర్తనలో వచ్చిన మార్పును ఐఎఫ్ఎస్ అధికారి ప్రస్తావించారు. వాహనాల రద్దీ ఎక్కువగా ఉండే రోడ్డుపై నక్క వచ్చి, దేని కోసమో ఎదురు చూస్తున్నట్టు ఉండటం ఆందోళనకరమని హెచ్చరించారు. గతంలో వాహనదారులు రహదారిపై నక్కకు ఆహారం పెట్టి ఉంటారని, దానికి అలవాటు పడి మళ్లీ అది రోడ్డుపైకి వచ్చేసిందని అన్నారు.

మరిన్ని వీడియోల కోసం :

2025లో చక్ దే ఇండియా..వీడియో

వాళ్లకు ప్రమోషన్ పాఠాలు నేర్పిస్తున్న స్టార్ డైరెక్టర్ వీడియో

చిరంజీవి సినిమాలో మలయాళ సూపర్ స్టార్? వీడియో

మార్పు మంచిదే అంటున్న అనన్య పాండే వీడియో