
జాంగ్ ప్రయాణం ఈజీగా సాగలేదు. 2020లో బ్రేక్‌ఫాస్ట్ సెంటర్ ప్రారంభించి నష్టపోవడంతో సుమారు 6 లక్షల రూపాయల అప్పులపాలయ్యాడు. ఆ అప్పులు తీర్చి, తన కాళ్ల మీద తాను నిలబడాలనే పట్టుదలతో షాంఘై నగరానికి వలస వచ్చాడు. అక్కడ ఫుడ్ డెలివరీ ఏజెంట్‌గా చేరిన జాంగ్, అప్పులు తీర్చడమే కాకుండా తన భవిష్యత్తు కోసం కోటి రూపాయలకు పైగా వెనకేయడం అతని ఆర్థిక క్రమశిక్షణకు అద్దం పడుతోంది. జాంగ్ ఇంత పెద్ద మొత్తాన్ని సంపాదించడం వెనుక ఒకే ఒక్క సూత్రం ఉంది. అదే నిరంతర శ్రమ. ఉదయం 10:40 గంటలకు మొదలుపెట్టి.. అర్ధరాత్రి దాటిన తర్వాత 1 గంట వరకు ఆర్డర్లు డెలివరీ చేసేవాడు. సెలవులు తీసుకోకుండా పని చేయడమే కాకుండా, సమయాన్ని ఆదా చేసేందుకు డెలివరీ సమయంలో ఎప్పుడూ పరిగెడుతూనే ఉండేవాడు. అందుకే తన తోటి రైడర్లు అతన్ని గౌరవంగా ‘ఆర్డర్ కింగ్’ అని పిలుస్తారు.
మరిన్ని వీడియోల కోసం :