
ప్రస్తుతం ఉన్న లాటరీ విధానం దుర్వినియోగం అవుతోందని, అమెరికన్ల కన్నా తక్కువ వేతనాలకు పనిచేసే విదేశీ కార్మికులను తీసుకురావడానికి ఈ విధానాన్ని కంపెనీలు ఉపయోగించుకుంటున్నాయని అమెరికా భావిస్తోంది. ఇప్పటిదాకా హెచ్-1బీ వీసాల జారీకి అమెరికా హోం ల్యాండ్ సెక్యూరిటీ అనుసరిస్తున్న లాటరీ విధానంలో.. ఆ వీసాపై రావాలనుకునే ఉద్యోగులందరూ సమానమే. ప్రతిభ ఆధారంగాగానీ.. జీతం ఆధారంగాగానీ ఎవరికీ ఎలాంటి ప్రాధాన్యమూ ఇవ్వరు. వచ్చిన దరఖాస్తులన్నింటినీ తీసుకుని కంప్యూటరైజ్డ్ విధానంలో లాటరీ వేసేవారు. ఎంపికైనవారు అమెరికాకు వచ్చేవారు. కానీ.. కొత్త విధానంలో ‘వెయిటెడ్ సెలక్షన్’ పద్ధతిని అనుసరిస్తారు. అంటే.. ఎక్కువ నైపుణ్యం ఉండి, ఎక్కువ జీతం అందుకునే వారికి ఎక్కువ ప్రాధాన్యం.. ఎంపిక ప్రక్రియలో ఎక్కువ అవకాశాలు ఇస్తారు. కొత్తగా ఉద్యోగంలో చేరేవారికి తక్కువ ప్రాధాన్యం ఇస్తారు.
మరిన్ని వీడియోల కోసం :