
రాష్ట్రవ్యాప్తంగా ఉష్ణోగ్రతలు కనిష్ఠ స్థాయికి పడిపోవడంతో సీజనల్ వ్యాధులు కూడా పంజా విసులురుతున్నాయి. ప్రతి ఇంట్లో చలి జ్వరంతో ప్రజలు బాధపడుతున్నారు. ప్రతి ఇంటా జలుబు, దగ్గు, ఒళ్లు నొప్పుల బాధితులు కనిపిస్తున్నారు. రానున్న మరికొన్ని రోజులు ఇదే పరిస్థితి కొనసాగుతుందని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. చలి తీవ్రత వల్ల బాడీ మెకానిజం దెబ్బతినే ప్రమాదం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. దీనివల్ల రక్తనాళాలు కుంచించుకుపోయి బీపీ పెరగడం, తద్వారా గుండెపోటు, బ్రెయిన్ స్ట్రోక్ వచ్చే అవకాశాలు ఎక్కువ అని హెచ్చరిస్తున్నారు. చలి నుంచి ఉపశమనం కోసం ఆల్కహాల్ తీసుకోవడం పరిష్కారం కాదని వైద్యులు స్పష్టం చేస్తున్నారు. మద్యం తాగేటప్పుడు రక్తనాళాలు వ్యాకోచించి శరీరానికి తాత్కాలికంగా వెచ్చదనం లభించినప్పటికీ, ఆ తర్వాత ఉష్ణోగ్రతలు అకస్మాత్తుగా పడిపోతే, అది ‘హైపోథెర్మియా’ వంటి ప్రాణాంతక స్థితికి దారితీసే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు.
మరిన్ని వీడియోల కోసం :